నిజాంసాగర్ బ్యాక్‌వాటర్‌లో నీట మునుగుతున్న పంట పొలాలు
-ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ నది పరివాహకమంతా
-శుభ్రపరచుటకు నిధులు మంజూరు చేయమని మంత్రికి వినతి
ఎల్లారెడ్డి అక్టోబర్ 7 (విజయక్రాంతి): సోమవారం, హైదరాబాదులోని, డా. బి.ఆర్. అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్లో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రివ్యూ మీటింగ్లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డితో ఎమ్మెల్యే మదన్మోహన్, ఈ సమావేశంలో కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనుల పురోగతి, ఇటీవల భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పోచారం ప్రాజెక్ట్ బలోపేతం, సిల్ట్ తొలగింపు చర్యలు, అలాగే ప్రాజెక్ట్ ప్రవాహం క్రింద ఉన్న అడవి లాగా మరీనా చెట్ల తొలగింపు,వంటి అంశాలపై సమగ్రంగా చర్చ నిర్వహించారు.
ఎమ్మెల్యే మదన్ మోహన్ ఈ సందర్భంలో మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యం కారణంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని, వెంటనే మరమ్మతులు చేపట్టి అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని మంత్రి ని కోరారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ఎక్కువాన ఉన్న మంజీరా నది పరివాహక ప్రాంతంలో నదిలో గుంపులు గుంపులుగా చెట్లు పొదలు మొలసి ఇసుకమేటలు మట్టిదిబ్బలు పెట్టి నీటిని వెనుకకు నెట్టుతూ రైతుల పంట పొలాలకు నష్టం వాటిల్లుతుందని, వెంటనే నదిలో ఉన్న ఇసుకదిబ్బలను గుంపు చెట్లను తొలగించడానికి చర్యలు చేపట్టాలని మంత్రి గారిని ఎమ్మెల్యే మదన్మోహన్ కోరారు.
ఎమ్మెల్యే మదన్మోహన్ వినతి మేరకు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించి, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని మైనర్ ఇరిగేషన్ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదుల శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ, ఈ&సి, చీఫ్ ఇంజినీర్లు, సంబంధిత అధికారులు జుక్కల్ శాసనసభ్యులు లక్ష్మీకాంత రావు తదితరులు పాల్గొన్నారు.




