27 May, 2026 | 5:25 PM

Breaking News

మంత్రులు పొన్నం, అజారుద్దీన్ ముందే కొట్టుకున్న ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్   •   ప్రొఫెసర్ నాగేశ్వరరావు అక్రమ అరెస్టును ఖండించిన ప్రజా సంఘాలు   •   రంగంపేటలో ధాన్యం లారీల కోసం రోడ్డు ఎక్కిన రైతన్న   •   కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్ వేయాలని ఉదృతమవుతున్న పోరాటం   •   బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇండ్లు కడితేనే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా   •   ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతాంగానికి చేరే విధంగా చూడాలి   •   విద్యుత్ షాక్ తగిలి ఐదు బర్రెలు మృతి   •   బక్రీద్ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు   •   ఉట్నూర్ ఆర్డీవ గా బాధ్యతలు చేపట్టిన మోహన్ సింగ్   •   NEET 2026 Paper leak caseలో సీబీఐ దూకుడు.. 13కి చేరిన అరెస్టుల సంఖ్య   •  

దోషులకు శిక్షపడేలా నేర విచారణ ఉండాలి

31-03-2026 12:43 AM

మహబూబాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): నేరాలకు పాల్పడ్డ దోషులకు చట్ట ప్రకారం శిక్ష పడే విధంగా పోలీసులు నేర విచారణలో తగిన సాక్షాలను ప్రవేశపెట్టాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ అన్నారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్ లో పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ జిల్లాలో నమోదైన వివిధ రకాల కేసులపై విస్తృతంగా సమీక్ష నిర్వహించి, పెండింగ్ కేసులు, గ్రేవ్ నేచర్ కేసులు, మహిళలు , బాలలపై నేరాలకు సంబంధించిన కేసులు, ప్రాపర్టీ ఆఫెన్సులు వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించారు.

ప్రతి కేసు ఫైల్ను ఎస్పీ స్వయంగా పరిశీలించి, దర్యాప్తు పురోగతి, సాక్ష్యాధారాల సేకరణ విధానం, సాంకేతిక ఆధారాల వినియోగం, సాక్షుల వాంగ్మూలాల నమోదు వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. దర్యాప్తు నాణ్యతను మరింత మెరుగుపరచడానికి అవసరమైన సూచనలు చేస్తూ, ప్రతి కేసులో చట్టపరమైన విధానాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ముఖ్యంగా కేసులలో చార్జ్ షీట్లను పూర్తి స్థాయిలో, లోపాలు లేకుండా, సమయపాలనతో కోర్టులో దాఖలు చేయాలని వివరంగా తెలియజేశారు.

చార్జ్ షీట్ తయారీలో ప్రతి అంశం స్పష్టంగా ఉండేలా, సాక్ష్యాధారాలు బలంగా ప్రతిపాదించేలా, కోర్టులో కేసు నిలబడే వి ధంగా రూపొందించాలన్నారు. నేరస్తులు తప్పించుకోకుండా, బాధితులకు న్యాయం అందేలా దర్యాప్తు చేయడం పోలీస్ అధికారుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. జిల్లాలో గంజాయి వినియోగం, యువత పై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ ఆదేశించారు. గంజాయి తాగేవారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ఇలాంటి కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించేందుకు క్ర మం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని సూచించారు.

ఇకపై నైట్ పెట్రోలింగ్ ను మరింత బలోపేతం చేయాలని, ప్రతి సర్కిల్లో సీఐలు, ఎస్‌ఐలు స్వయంగా రాత్రి సమయంలో గ్రామాల ను సందర్శిస్తూ పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు. డీఎస్పీలు కూడా తరచూ రాత్రి ప ర్యటనలు నిర్వహించి పోలీస్ వ్యవస్థ పనితీరును సమీక్షించాలని సూచించారు. ప్రజల్లో భద్రతాభావం పెంపొందించే దిశగా పట్రోలింగ్ను సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. సమా వేశం అనంతరం, ఇటీవల మూడు కేసుల్లో నిందితులకు శిక్షలు విధించబడేలా కృషి చేసిన సీడీఓలు, సంబంధిత పోలీస్ అధికారులను ఎస్పీ అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేశారు.