31 March, 2026 | 3:18 AM

మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలి

31-03-2026 01:40 AM

ఆయన మైనింగ్ అక్రమాలు, భూకబ్జాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి

  1. సాక్ష్యాధారాలతో గవర్నర్‌కు బీఆర్‌ఎస్ శాసనసభా పక్షం ఫిర్యాదు 
  2. రాఘవ కన్‌స్ట్ట్రక్షన్స్ భాగోతంపై సభాసంఘం వేయాలి 
  3. రేవంత్‌రెడ్డి కంటే పెద్ద బ్లాక్‌మెయిలర్ ఎవరూ లేరు 
  4. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, మార్చి 30 (విజయక్రాంతి) : మైనింగ్ అక్రమాలకు పాల్పడిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని మంత్రివర్గం నుంచి వెంటనే బర్త్ఫ్ చేయాలని బీఆర్‌ఎస్ శాసనసభాపక్షం డిమాండ్ చేసింది. ఆయన అక్రమాలపైన ఇండిపెండెంట్ జ్యుడీషియల్ ఎంక్వైరీ, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని బీఆర్‌ఎస్ నాయకులు విజ్ఞప్తి చేశారు. మంత్రి పొంగులేటి అక్ర మ మైనింగ్, భూకబ్జాలపైన విచారణ చేపట్టాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాని కలిశారు.

లోక్‌భవన్‌లో గవర్నర్‌తో దాదాపు గంటకు పైగా సమావేశ మైన బీఆర్‌ఎస్ సభా పక్షం నేతలు మంత్రి పొంగులేటి అక్రమ మైనింగ్, అరాచకంగా భూకబ్జాలకు పాల్పడుతున్నారని గవర్నర్‌కు తెలిపారు. ఒకప్పుడు ‘ఇందిరమ్మ రాజ్యం’ అని చెప్పి అధికారంలోకి వచ్చి న కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో అచ్చంగా ఆనాటి ఎమర్జెన్సీ రోజులను తీసుకువచ్చిందన్నారు. ఎమర్జెన్సీ సమయంలో తన కూడా 19 నెలల పాటు జైలు అనుభవించారని ఈ సందర్భంగా గవర్నర్ గుర్తుచేశారు.

దురదృష్టవశాత్తు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు ఎమర్జెన్సీ నాటి అరాచక పరిస్థితులు ఎదుర్కొంటున్నారని పార్టీ నేత లు తెలిపారు. పొంగులేటికి చెందిన ‘రాఘవ కన్‌స్ట్ట్రక్షన్స్’ అనే కంపెనీ మైనింగ్ నిబంధనలను ఉల్లంఘిం చి, జంట జలాశయాల పరిధిలో మైనింగ్ నిషేధం ఉన్నప్పటికీ అక్రమంగా మైనింగ్ చేస్తున్నారన్నారు.

సంబంధం లేని భూమిని చెరబట్టి ఎలాంటి మినరల్ డీలర్ లైసెన్స్, పొల్యూషన్ బోర్డ్ అనుమతులు, విద్యుత్ కనెక్షన్లు, పరిశ్రమల శాఖ అనుమతులు లేకుండానే రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా వందల కోట్ల ప్రజా సంపదను, రెవెన్యూ మంత్రి కుటుంబం కొల్లగొడుతుందని అన్ని ఆధారాలతో సహా గవర్నర్‌కు ఒక విజ్ఞాపనపత్రాన్ని అందజేశారు. సీఎం, రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి ఈ అంశంలో చర్యలు తీసుకోవాలని శాసనసభలో లేవనెత్తితే మొ త్తం ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను సభ నుంచి బహిష్కరించారన్నారు.

అదే అసెంబ్లీ సమావేశాల్లోనే.. రాఘవ కన్‌స్ట్ట్రక్షన్స్ కంపెనీ తప్పు చేసిందని, దానికి సంబంధించి మా ప్రభుత్వమే కొన్ని నోటీసులు కూడా ఇచ్చిందని ముఖ్యమంత్రి అసలు నిజాన్ని ఒప్పుకున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. మంత్రి పొం గులేటిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశామని కేటీఆర్, హరీష్‌రావు, పార్టీ నేతలు గవ ర్నర్‌కు తెలియజేశారు. 

న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు..

కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఒకవైపు శాసనసభా సంఘాన్ని ఏర్పాటుచేస్తే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని, మంత్రి పొంగులేటి వందల కోట్ల రూపాయల అక్రమ మైనింగ్‌తోపాటు అక్రమ భూకబ్జాలు బయటకు వస్తాయని తెలిపారు. ఓ పక్క పార్లమెంట్‌లో రాహుల్‌గాంధీ జా యింట్ పార్లమెంటరీ కమిటీలు కావాలని పట్టుబడతారు, ఇక్కడ మాత్రం సభానాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం సభాసంఘాలకు విలువలేదు అన్నట్లు తన సొంత ప్రభుత్వ ఏజెన్సీలతోనే విచారణ జేపిస్తామంటున్నారని ఎద్దేవా చేశారు..

ముఖ్య మంత్రే స్వయంగా హోంశాఖ మంత్రి బాధ్యతలు తీసుకున్నప్పుడు సీబీసీఐడీతోగాని, రాష్ట్ర హోమ్ శాఖ అధికారులతోగాని న్యా యం జరుగుతుందన్న నమ్మకంలేదన్నారు. అందుకే ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీతో సభాసంఘాన్ని ఏర్పాటు చేయాలని లేదా ఇండిపెం డెంట్ జుడీషియల్ ఇంక్వైరీ కావాలని గవర్నర్‌కు చెప్పామన్నారు. మంత్రిగా ఉన్న పొం గులేటి తన ప్రభుత్వమే చేపట్టే విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. 

గవర్నర్ జోక్యం చేసుకొని న్యాయం చేయాలన్నారు. దీంతోపాటు ప్రభుత్వం మొత్తం గవర్నర్ పేరుతోనే నడుస్తుంది కాబట్టి ఆయన జోక్యం చేసుకొని ఒక స్వతంత్ర విచారణ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలతో విచారణకు ఆదేశించే విధంగా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు.

ఆర్టీఐ ద్వారా అడ్డగోలుగా.. 

ఈ మొత్తం అంశాలను విని, ఇచ్చిన సాక్ష్యాధారాలను చూసిన తర్వాత ఈ అం శంలో సానుకూలంగా స్పందిస్తానని గవర్నర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. అయితే ఈ మొత్తం అంశంలో భారతీయ జనతా పార్టీ కూడా మౌనంగా ఉన్నదని, ఇప్పటిదాకా ప్రభుత్వంపైన ఎలాంటి ఒత్తిడి తీసు కురాలేదని కేటీఆర్ ఆరోపించారు. గవర్నర్‌కు మేము ఇచ్చిన విజ్ఞప్తి తర్వాత ముం దుకు రాకుంటే కచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఎండగడతామని, బాధితులకు న్యాయం జరిగేదాకా, అక్రమ మైనింగ్ ఆగేవరకు పోరాటం చేస్తామన్నారు.

రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలింగ్ కోసమే పొంగులేటి అక్రమాలను బయటకు తీసుకువచ్చిందని చేసిన కామెంట్లకు స్పందిస్తూ, రేవంత్ రెడ్డి కంటే పెద్ద బ్లాక్ మెయిలర్ రాష్ట్రంలో ఎవరూ ఉండరని, ఒకప్పుడు ఆర్టీఐని అడ్డుగా పెట్టుకొని అడ్డగో లుగా సంపాదించిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అన్నారు. ఎవరు అడిగినా విచారణకు ఆదేశిస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి మాటమార్చి పొంగులేటి పైన విచా రణ చేయడానికి వెనక్కిపోయారని కేటీఆర్ విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వై రీ చేస్తే అమృత్ కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్ కుంభకోణం, సింగరేణి కుంభకోణం, హైదరాబాద్ పారిశ్రామిక భూ ముల హిల్ట్ పీ పాలసీ కుంభకోణం.. ఇలా దాదాపు 14 అంశాలపైన ఆధారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, ఎంక్వైరీ చే యాలని సీఎంకు సవాల్ విసిరారు. రేవం త్ కుటుంబమైనా, శ్రీనివాస్‌రెడ్డి కుటుంబమైనా చర్య లు తీసుకుంటానని చెప్పిన రేవంత్, ఆధారాలతో సహా పొంగులేటి కుంభకోణాన్ని బయటపెడితే మౌనంగా ఉన్నారన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి దమ్ముంటే చర్యలు తీసుకొని తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సవాలు చేశారు.