2 April, 2026 | 6:45 AM

ఇందిరమ్మ ఇండ్ల కమిటీ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడితే క్రిమినల్ కేసులు

02-04-2026 01:18 AM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు, ఏప్రిల్ 1: నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేస్తున్న క్రమంలో ఎవరై నా ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యుల పేరుతో ఇల్లు, స్థలాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా గృ హ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడగా పేరొందిన పటాన్ చెరు నియోజకవర్గంలో అత్యధిక శాతం పేద, మధ్యతరగతి ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నాయకత్వంలో నియోజకవర్గ పరిధిలోని వేల మంది పే దలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అందజేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర భుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సొంత స్థలము ఉంటే ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం, స్థలం లేని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయిస్తోంద ని తెలిపారు.

పూర్తి పారదర్శకతతో అర్హులైన ప్రతి ఒక్కరికి వీటిని అందించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఇందిరమ్మ కమిటీ సభ్యుల పేరుతో కొందరు వ్యక్తులు పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని గ్రామాలు, పట్టణాలు, డివిజన్లలో తిరుగుతూ ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామంటూ వేల రూపాయలు వసూలు చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించాలని గృహ నిర్మాణ శాఖ జిల్లా పీడీ చలపతిరావు ను ఆదేశించారు. ఈ సమావేశంలో డిఈ సుజాత, ఏఈ లు పాల్గొన్నారు.