21-02-2026 01:48:29 AM
‘పొన్నియిన్ సెల్వన్-2’ చిత్రంలోని ‘వీర రాజా వీర’ పాటను దగర్ కుటుంబానికి చెందిన ‘శివస్తుతి’ నుంచి స్ఫూర్తి పొంది స్వరపరిచినట్లు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఒప్పుకున్నారు. శుక్రవారం ఈ కేసు విచారణకు రాగా, రెహమాన్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. దివంగత ఉస్తాద్ ఎన్ ఫయాజుద్దీన్ దగర్, ఉస్తాద్ ఎన్ జహీరొద్దీన్ దగర్ ప్రదర్శనను గుర్తిస్తూ పాటకు క్రెడిట్ ఇచ్చేందుకు రెహమాన్ అంగీకరించారని తెలిపారు.
అయితే, ఢిల్లీ హైకోర్టులో కొనసాగుతున్న ప్రధాన సివిల్ దావాలో తమ హక్కులకు ఎలాంటి భంగం కలగని రీతిలో ఈ తాత్కాలిక ఏర్పాటుకు ఒప్పుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ వాదనలను నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఐదు వారాల్లోగా అన్ని సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో పాట క్రెడిట్స్‌లో ఈ మార్పులు చేయాలని ఆదేశించింది. ఈ తాత్కాలిక ఒప్పందం వల్ల హైకోర్టులోని సివిల్ సూట్‌పై ఎలాంటి ప్రభావం ఉండదని, ఆ కేసు మెరిట్స్ ఆధారంగానే విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది.