calender_icon.png 20 February, 2026 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిరాకిల్ ఎంట్రీ!

20-02-2026 01:55:37 AM

సత్య గ్యాంగ్, ఫైటర్ శివ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రభాస్ నిమ్మల. ఆయన దర్శకత్వంలో ఇప్పుడు మరో సినిమా రూపొందుతోంది. ‘మిరాకిల్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను సైదా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రమేశ్ ఎగ్గిడి శ్రీకాంత్, మొగదాసు చందర్ గౌడ్ నిర్మిస్తున్నారు. ఇందులో రణధీర్ భీసు కథానాయకుడిగా నటిస్తుండగా, హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ కథానాయికగా అలరించనుంది. సీనియర్ హీరోలు శ్రీరామ్, సురేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

నాయుడు పెండ్ర ప్రతినాయక పాత్రతో వెండితెరకు పరిచయమవుతున్నారు. ధీరజ అప్పాజీ, జనార్దన్, యోగి కాత్రే, విజయ్ సూర్య, ఇంతియాజ్, సాయిబాబా, దిల్ రమేశ్, ఝాన్సీ, సూర్యనారాయణ, శ్రీధర్, శ్రీకాంత్, శివ, ఆమని, హైమావతి, నవ్య, సమీర్ దత్తా, అనుశ్రీ, బెజవాడ మస్తాన్, ఆర్ కుమార్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై, ఇప్పటికే రెండు షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది.

ఈ నెల 24 నుంచి హైదరాబాద్ పరిసర ప్రాం తాల్లో జరగనున్న మూడో షెడ్యూల్ ప్రారంభం కానుం ది. ఈ తాజా షెడ్యూల్‌లో హీరోయిన్ హెబ్బా పటేల్ పాల్గొననుంది. ఈ విషయాన్ని టీమ్ అధికారికంగా వెల్లడించింది. ఈ సందర్భంగా నిర్మా తలు మాట్లాడుతూ.. “డైరెక్టర్ ప్రభాస్ నిమ్మ ల తన మూడో చిత్రంతో వస్తున్నారు.

హెబ్బా పటేల్ గ్లామర్, సీనియర్ హీరోలు శ్రీరామ్, సురేశ్ కీలక పాత్రలు, ము ఖ్యంగా యాక్షన్ బ్లాక్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ చిత్రానికి కెమెరా: సురేందర్‌రెడ్డి; లిరిక్స్: రాంబాబు గోసాల, ఫై ట్స్: శ్రీను; ఎడిటింగ్: విశ్వనా థ్; ని ర్మాతలు: రమేశ్ ఎగ్గి డి శ్రీకాంత్, మొగదాసు చంద ర్ గౌడ్; కథ, -మాటలు, -స్క్రీన్‌ప్లే-, సంగీతం, -ద ర్శకత్వం: ప్రభాస్ నిమ్మల.