ప్రతి మహిళకు హెల్త్ ప్రొఫైల్ తయారీ
కలెక్టర్ రాజర్షి షా వెల్లడి
ఆదిలాబాద్, మార్చి 17 (విజయక్రాంతి) : మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ త్వరలోనే జిల్లాలో ప్రతి మహిళకు ‘హెల్త్ ప్రొఫైల్’ తయారు చేయనున్నట్లు కలెక్టర్ రాజ ర్షి షా వెల్లడించారు. పీహెచ్సీ, సబ్ సెంటర్ల స్థాయిలో ప్రతిరోజూ 50 మంది మహిళలకు 30 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య స్థితిగతులను నమోదు చేస్తామన్నారు. మంగళవారం తాంసి, తలమడుగు మండలాల్లో ఆయన విసృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా తాంసి మండల కేం ద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మిత్ర ఎన్జీఓ సహకారంతో ఏర్పాటు చేసిన రూ. 2 లక్షల విలువైన నూతన వైద్య పరికరాలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆసుపత్రిలో విభాగాల ను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అదేవిధంగా ప్రజాపాల న -ప్రగతి ప్రణాళిక లో భాగంగా తలమడుగు మండల కేంద్రంలోని పశువైద్యశాలలో 8వ విద్యా జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించి, అవగాహన కల్పించే ప్రచార రథాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. లేబర్ రూమ్లో అవసరమైన టేబుల్స్, స్ట్రెచర్లు, డిజిటల్ బీపీ అపారటస్, రోగుల భద్రత కోసం సీసీటీవీ కెమెరాలను విరాళంగా అందించిన ఎస్బీఐ అధికారులకు, మిత్ర ఎన్జీఓ ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు చిన్నపాటి అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీపంలోని ఆరోగ్య ఉప కేంద్రాలు లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలని సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నార ని, ప్రజలు ప్రభుత్వ వైద్య వ్యవస్థపై నమ్మకాన్ని పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్బిఐ రీజనల్ మేనేజర్ రామచంద్ర రావు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఉత్పల్ కుమార్, డీఎంహెచ్‌ఓ నరేందర్ రాథోడ్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రామారావు, డాక్టర్ లావణ్య, తహసీల్దార్ లక్ష్మీ, రాజ్ మోహన్, ఎంపీడీఓ మోహన్ రెడ్డి, తాంసి బ్రాంచ్ మేనేజర్ శైలేష్, మైత్రి హాలిస్టిక్ హెల్త్ సొసైటీ లక్ష్మి రెడ్డి, డాక్టర్ శ్రావ్య వాణి, సర్పంచ్ సంతోష్ రెడ్డి, ఉప సర్పంచ్ గంగారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.




