3 July, 2026 | 9:08 PM

Breaking News

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •   కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి   •   ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన రీజినల్ మేనేజర్   •   శ్రీ లక్ష్మి భూలక్ష్మి సమేత శీతలాదేవి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి   •   అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ   •   కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •   దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా   •  

క్రేన్ కూలి ఐదుగురి దుర్మరణం

28-04-2026 12:50 AM
  1. మరో 11 మందికి తీవ్ర గాయాలు
  2. ఎన్సీసీ వర్క్‌షాప్‌లో ఘోర ప్రమాదం
  3. బలమైన ఈదురు గాలులు వీయడంతో దుర్ఘటన
  4. శంకర్‌పల్లి మండలం మహాలింగాపురంలో విషాదం

చేవెళ్ల /శంకర్ పల్లి (ఏప్రిల్ 27): రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మహాలింగా పురంలో పెను విషాదం నెలకొంది. స్థానిక ‘ఎన్సీసీ లిమిటెడ్’ (సెంట్రల్ వర్క్ షాప్)లో సోమవారం భారీ క్రేన్ కుప్పకూలిన ఘటనలో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కో ల్పోగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో షెడ్డులో మొత్తం 16 మంది కార్మికులు విధు లు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఎన్సీసీ కంపెనీలో భారీ యంత్రాల రిపేర్, సర్వీసింగ్, స్టీల్ ప్యాబ్రికేషన్ పనులు జరుగుతుం టాయి. సోమవారం సాయంత్రం ఒక్కసారిగా బలమైన ఈదురుగాలులు వీయడంతో కంపెనీలోని భారీ క్రేన్ నియంత్రణ కోల్పో యి కార్మికులు పనిచేస్తున్న షెడ్డుపై కుప్పకూలింది.

ఈ ఘటనలో బీహార్‌కు చెందిన అలీ హుస్సేన్, నాగేంద్ర సింగ్, సాజీమ్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ముకేష్ కుమార్, సోను రజిబిలను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశారు. గాయపడిన 11 మంది కార్మికులు జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వారు. వీరిని వెంటనే శంకర్ పల్లిలోని లలిత, గాయ త్రీ ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు ధృవీకరించారు. దుర్ఘటన విషయం తెలిసిన వెంటనే చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ డీసీపీ యోగేశ్ గౌతమ్, ఏసీపీ కిషన్, ఆర్డీవో పార్థసింహారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు.

ప్రమాదం జరిగిన తీరుపై కంపెనీ యాజమాన్యాన్ని ఆరా తీశా రు. ‘ప్రకృతి వైపరీత్యం (గాలి దుమారం) వల్ల ఈ ప్రమాదం జరగడం బాధాకరం. మృతుల కుటుంబాలకు, గాయపడిన వా రికి కంపెనీ తరపున తగిన పరిహారం అందే లా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. మరోవైపు, కంపెనీలో భద్రతా ప్రమాణాల పాటించడంలో ఏవైనా లోపాలు ఉన్నాయా అనే కో ణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీఐ ముదుసరి అలీ నేతృత్వంలో కేసు నమోదు చేసి, క్రేన్ కూలిన ప్రదేశాన్ని ఫోరెన్సిక్ నిపుణులు కూడా పరిశీలించనున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో  ఈ ప్రమాదంతో మహాలింగాపురం పారిశ్రామిక ప్రాంతంలో విషా ద ఛాయలు అలముకున్నా యి.