కలెక్టరేట్ ఎదుట సీపీఎం ధర్నా
ముకరంపుర,ఆగస్టు 20(విజయక్రాంతి): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు(Central and State Governments) ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కరీంనగర్ కలెక్టరేట్(Karimnagar Collectorate) ఎదురుగా గురువారం మిల్కూరి వాసుదేవరెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఖండిస్తూ నిరుద్యోగుల పట్ల అనుసరిస్తున్న వైఖరి సరికాదని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇస్తామన్న రెండు కోట్ల ఉద్యోగాలను వెంటనే ఇవ్వాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ప్రకటించిన రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని వారికి ఉపాధి లభించే అంతవరకు నిరుద్యోగ భృతిని 5000 రూపాయలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతతో చెలగాటమాడొద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






