20 August, 2026 | 12:31 PM

గుండెపోటుతో సింగరేణి కార్మికుని మృతి

20-08-2026 11:37 AM

కేటీకె 1వ ఇంక్లైన్ గనిలో ఘటన 

భూపాలపల్లి టౌన్, ఆగస్టు 20 (విజయక్రాంతి): గుండెపోటుతో కార్మికుడు మృతి చెందిన ఘటన సింగరేణి భూపాలపల్లి ఏరియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే స్థానిక కేటీకె 1వ ఇంక్లైన్ గనిలో బుధవారం రాత్రి డ్యూటీలో విధులు నిర్వర్తిస్తున్న కోల్ కట్టర్ గోపి ఛాతి నొప్పితో ఇబ్బంది పడ్డాడు. గమనించిన తోటి కార్మికులు పైకి తీసుకువచ్చి అంబులెన్సులో ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి మార్గమధ్యలోనే మృతి చెందాడు. అధికారులు మృతిపై ఆరా తీస్తూ వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుడు 1000 క్వారర్లలో నివాసమున్నట్లు భార్య, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నట్లు సమాచారం. ఏదేమైనా తోటి కార్మికుని మృతి పట్ల విధుల్లో ఉన్న కార్మికులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. గనిపైన విషాద ఛాయలు అలుముకున్నాయి.