13 July, 2026 | 4:37 PM

Breaking News

విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •   పిల్లల ఆరోగ్య రక్షణలో నులిపురుగుల నిర్మూలన ఎంతో ముఖ్యం   •   ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మిద్దాం   •  

సార్వత్రిక సమ్మెకు సీపీఐ సంపూర్ణ మద్దతు

11-02-2026 06:21 PM

మణుగూరు,(విజయక్రాంతి): లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలని, 29 కార్మిక చట్టాలు పునరుద్ధ రించాలని, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న సార్వత్రిక సమ్మెకు సిపిఎం సంపూర్ణ మద్దతు ఇస్తోం దని ఆ పార్టీ మండల, పట్టణ కార్యదర్శు లు  దుర్గ్యాల సుధాకర్, జక్కుల రాజబా బుతెలిపారు. బుధవారం పార్టీ కార్యాల యంలో వారు విలేకరులతో మాట్లాడారు.

కార్మికవర్గం ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న హక్కులను వారి నుంచి లాక్కోవాడానికి కేంద్రంలోని కార్పొరేట్‌, మతోన్మాద పాలన కుట్రలు చేస్తోందన్నారు. ఈ చర్యలను ప్రజలందరూ ఎదిరించా లన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానం లో అత్యంత నిరంకుశ పద్ధతిలో తీసు కొచ్చిన 4 లేబర్‌ కోడ్లను తిప్పికొట్టే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు.

గ్రామీణ కార్మిక వర్గమైన వ్యవసాయ కార్మి కులకు మేలు చేసే ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి విబి జీ ఆర్‌ఎం జీ పథకాన్ని ప్రవేశపెట్టడం దుర్మార్గంగా ఉందన్నారు. ఈ చర్యలన్నింటినీ నిరసి స్తూ ఈ నెల 12న చేస్తున్న దేశవ్యాప్త సమ్మెకు సిపిఐ పూర్తిగా మద్దతిస్తున్నదని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున కార్మికులు, రైతులు, కష్టజీవులు చేస్తున్న పోరాటానికి ప్రజలు కూడా కలిసి రావాలని పిలుపు నిచ్చారు. గడ్డం వెంకటేశ్వర్లు, రాయల బిక్షం, సీతా రాములు, బోశెట్టి సంపత్ పాల్గొన్నారు.