20 June, 2026 | 2:55 AM

మంచాల్ పీఎస్‌ను తనిఖీ చేసిన సీపీ తరుణ్ జోషి

20-06-2026 12:12 AM

ఇబ్రహీంపట్నం, జూన్ 19 (విజయక్రాంతి): ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి మంచాల్ పోలీస్ స్టేషన్ను సందర్శించి, రికార్డులు మరియు శాంతిభద్రతలను సమీక్షించారు. బాధితుల ఫిర్యాదులను వెంటనే స్వీకరించి, సత్వరమే పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. బీట్ పోలీసింగ్, కమ్యూనిటీ పోలీసింగ్ను బలోపేతం చేస్తూ ప్రజలకు పారదర్శకమైన, స్నేహపూర్వక సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ కేపీవీ రాజు పాల్గొన్నారు.