23 July, 2026 | 1:05 AM

నాచారం ఎస్‌ఐ ఫ్రాన్సిస్‌కు సీపీ రివార్డ్

23-07-2026 12:07 AM

ఉప్పల్, జూలై 22 (విజయక్రాంతి) : విధి నిర్వహణ లో అంకితభావం, క్రమశిక్ష ణ, ప్రజలకు మెరుగైన పోలీసింగ్ సేవలు అందించినం దుకు నాచారం పోలీస్ స్టేష న్కు చెందిన ఎస్‌ఐ ఫ్రాన్సి స్కు మల్కాజిగిరి  కమిషనర్ సుమతి  ప్రత్యేక రివార్డ్ అం దజేశారు.

2026 సంవత్సరంలో అత్యుత్తమ సేవలు అం దించిన పోలీసు అధికారులను గుర్తించి సత్కరించే కార్యక్రమంలో భాగంగా ఎస్‌ఐ ఫ్రాన్సి స్ను రివార్డ్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు ఆయన సేవలను కొనియాడుతూ, ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. రివార్డ్ అందుకున్న ఎస్‌ఐ ఫ్రాన్సిస్కు సహచర పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ గుర్తింపు ఇక్కడి పోలీస్ స్టేషన్ సిబ్బందికి మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు.