24 July, 2026 | 9:10 PM

Breaking News

ప్రజలతో మర్యాదపూర్వకంగా మెలగాలి

24-07-2026 08:03 PM

- పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

- తాండూర్ పీ ఎస్ తనిఖీ

బెల్లంపల్లి,(విజయక్రాంతి): పోలీసులు ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. మంచిర్యాల జోన్‌ తాండూర్ సర్కిల్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఈ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, సీఐ దేవయ్య పుష్పగుచ్ఛం అందించి ఆయనకు స్వాగతం పలికారు. తాండూర్ సర్కిల్ కార్యాలయాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ సర్కిల్ పరిధిలో నమోదైన గ్రేవ్ కేసులు, దర్యాప్తులో ఉన్న కేసుల సీడీ ఫైళ్లు, పెండింగ్ ట్రయల్ కేసులకు సంబంధించిన సీడీ ఫైళ్లను పరిశీలించారు.

ముఖ్యంగా పోక్సో కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా నాణ్యమైన దర్యాప్తు నిర్వహించాలని సూచించారు. కేసుల దర్యాప్తులో నాణ్యతతో పాటు వేగం కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ,సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తమ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లను క్రమం తప్పకుండా సందర్శిస్తూ,వాటి పనితీరును నిరంతరం పర్యవేక్షించాలనిన్నారు. సిబ్బంది విధి నిర్వహణను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైన మార్గదర్శకాలు అందించాలని తెలిపారు. భూ వివాదాలకు సంబంధించిన ప్రతి ఫిర్యాదును నిష్పాక్షికంగా, నిజాయితీతో విచారించి, చట్టబద్ధంగా దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తులపై అనవసరంగా బలప్రయోగం చేయరాదని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన మేరకే చట్టబద్ధమైన బలాన్ని వినియోగించాలనిన్నారు. నేరాల నియంత్రణ కోసం రాత్రి వేళల్లో ప్రివెంటివ్ పెట్రోలింగ్, వాహనాల తనిఖీలు నిర్వహించాలనికోరారు. సర్కిల్ పరిధిలోని రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలనిన్నారు. నేరాల దర్యాప్తులో వస్తున్న తాజా పరిణామాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంపొందించుకోవాలనిన్నారు.

ముఖ్యంగా ఎస్‌ఐ స్థాయి నుంచి పైస్థాయి అధికారులందరూ సీసీటీఎన్‌ఎస్, సమాచార సాంకేతికత (ఐటీ),ఆధునిక పోలీసింగ్‌లో వినియోగిస్తున్న సాంకేతిక వ్యవస్థలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. భవిష్యత్తులో సాంకేతికత వినియోగం మరింత పెరుగుతుందని, ప్రమోషన్లతో బాధ్యతలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి అధికారి తమ సాంకేతిక నైపుణ్యాలను (సాఫ్ట్ స్కిల్స్) అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ప్రతి పిటిషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, ఫిర్యాదుదారుల వివరాలను సమగ్రంగా ధృవీకరించాలని తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి పిటిషనర్‌తోమర్యాదపూర్వకంగా, ఓర్పుతో, సహాయం అందించాలని సూచించారు. విధి నిర్వహణలో నిష్పాక్షికంగా ప్రజలకు న్యాయం చేయడమే ప్రతి పోలీసు అధికారి ప్రధాన పని అని పేర్కొన్నారు.