కేటీఆర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు
రోగులకు పండ్లు, బ్రెడ్, పాలు పంపిణీ
కల్లూరు,(విజయక్రాంతి): మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని కల్లూరు మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు,బ్రెడ్,పాలను పంపిణీ చేసి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. రోగుల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటూ, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ,కేటీఆర్ సేవా భావం,ప్రజా సంక్షేమంపై ఆయనకు ఉన్న నిబద్ధత యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. ఆయన పుట్టినరోజును సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం సార్థకమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కట్ట అజయ్ బాబు, డాక్టర్ లక్కినేని రఘు, కాటంనేని వెంకటేశ్వరరావు, కౌన్సిలర్ పెడకంటి రామకృష్ణ, కొరకొప్పు ప్రసాద్, ఇస్మాయిల్, షేక్కమ్లి సర్పంచ్ వేమకృష్ణ, మాజీ సర్పంచ్ సూర్యనారాయణ, వార్డు సభ్యులు బాబురావు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ అభిమానులు పాల్గొన్నారు.






