అమరావతిలో కోర్ట్‌యార్డ్ బై మారియట్
భూమి పూజ చేసిన సదరన్ గ్లోబ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్
అమరావతి, మే 8 : అమరావతి నగరాన్ని అంతర్జాతీయ స్థాయి హాస్పిటాలిటీ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దే దిశలో మరో కీలక ముందడుగుగా, సదరన్ గ్లోబ్ హోట ల్స్ అండ్ రిసార్ట్స్ నిర్మించనున్న ప్రతిష్టాత్మక కోర్ట్‌యార్డ్ బై మారియట్ హోటల్ ప్రాజెక్ట్‌కు శుక్రవారం ఘనంగా భూమి పూజ నిర్వహించారు.
సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకే ష్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్, పర్యాటక, సాంస్కృతిక అండ్ సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి మంత్రి కందుల దుర్గేష్‌తో పాటు పలువురు ప్రముఖులు, ప్ర జాప్రతినిధులు, పారిశ్రామ వేత్తలు మరియు వ్యాపారవేత్తలు కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రాజెక్ట్ ప్రాముఖ్యతను కొనియాడారు.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను సదరన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణమోహన్ ఆలపాటి, గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్ లిమిటె డ్ చైర్మన్ వేద్ ఖురానా, డెల్టా ప్యూర్ వాటర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విక్రం కరుణాకరం భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్నారు.
ఈ సందర్భంగా సదరన్ ట్రావెల్స్ ప్రైవే ట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణమోహన్ ఆలపాటి మాట్లాడుతూ అమరావతిలో ఈ ప్రతిష్ఠాత్మక హోటల్ ప్రాజెక్ట్‌కు భూమిపూజ నిర్వహించడం మా సంస్థకు గర్వకారణం అ న్నారు. ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయమైన కోర్ట్‌యార్డ్ బై మారియట్ బ్రాండ్‌తో భాగస్వామ్యం ద్వారా అమరావతిలో అంతర్జాతీయ స్థాయి హాస్పిటాలిటీ మౌలిక వసతులను అభివృద్ధి చేయడమే మా లక్ష్యం అన్నారు.






