రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి
19-05-2026 01:26 AM
గజ్వెల్, మే 18: బైక్, కారు ఢీ కొన్న ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. మృతుల బంధువులు తెలిపిన ప్రకారం గజ్వేల్ మండలం శేరిపల్లి గ్రామానికి చెందిన దంపతులు అత్తల్లి ప్రవీణ్ (48), జ్యోతి(45) బైక్ పై రిమ్మనగూడలో బంధువుల ఇంట్లో విందుకు హాజరై తిరిగి రింగురోడ్డు గుండా స్వగ్రామం శేరిపల్లికి వెళ్తున్నారు.
పిడిచేడ్ గ్రామ సమీపంలోని కాటన్ మిల్లు వద్దకు రాగానే ఓ వ్యక్తి బాగా మద్యం తాగి కారు నడుపుతున్న ఓ వ్యక్తి కారుతో ప్రవీణ్ దంపతులు ప్రయాణిస్తున్న బైక్ ను ఢీ కొట్టాడు. దీంతో బైక్ పై వెళ్తున్న ఇద్దరు బైక్ తో సహా దూరంగా పడిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వెల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.






