శాఖాంబరిగా దర్శనమిచ్చిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారు
గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు
ఆలయ అర్చకులు మారుపాక ప్రశాంత్ శర్మ
మంథని,(విజయక్రాంతి): ఆషాడశుద్ధ పౌర్ణమి (గురు పౌర్ణమి) పర్వదినమును పురస్కరించుకొని బుధవారం మంథని పట్టణంలోని శ్రీ మహాలక్ష్మీ దేవాలయంలో "శాఖాంబరి" ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు మారుపాక ప్రశాంత్ శర్మ ఉదయం 4 గంటలకు అమ్మవారికి అభిషేకం, 6 గంటలకు అర్చన అనంతరము శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని శాఖాంబరిగా అలంకరించారు. అనంతరం ఉదయం 6 గంటలకు అమ్మవారు శాఖాంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు.
అనంతరం ఆలయంలో శ్రీ లలితా సహస్రనామ పారాయణం కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రత్యేక భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం పవళింపు సేవ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. దుర్గముడు అనే రాక్షసుని బారి నుండి సమస్త జీవకోటిని రక్షించుటకు శ్రీ ఆదిపరాశక్తి మాత శాఖాంబరిగా కీర్తించబడినదని శ్రీ దేవి భాగవతంలోని సప్త మస్కందములో తెలుపబడినది. ఆ దేవి అనుగ్రహించిన 9 అవతారంలలో శాకాంబరీ దేవి అవతారం ఒకటిగా పేర్కొనబడినది.






