29 July, 2026 | 8:14 PM

కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి

29-07-2026 07:03 PM

డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క

ఆసిఫాబాద్(విజయక్రాంతి): రెబ్బెన మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయాన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క బుధవారం ప్రారంభించారు. అనంతరం నూతన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కిషన్ గౌడ్‌ను శాలువాతో సన్మానించి అభినందించారు.ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంలో మండల కార్యాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి నాయకులు కృషి చేయాలని సూచించారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియను మండలంలో వేగవంతంగా పూర్తి చేసి, ప్రతి అర్హ ఓటరు పేరు జాబితాలో ఉండేలా బీఎల్‌ఏలు, బీఎల్‌ఓలతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అబ్దుల్లా భాయ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి గాదెవేణి మల్లేష్, జిల్లా ఉపాధ్యక్షుడు పల్లె ప్రకాశ్‌రావు, జిల్లా అధికార ప్రతినిధి దుర్గం రవీందర్, పలువురు జిల్లా, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, బీఎల్‌ఏలు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.