29 July, 2026 | 8:14 PM

ఏకల్ అభియాన్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవం

29-07-2026 07:16 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): వేదవ్యాస మహార్షి జన్మదినం సందర్భంగా కామారెడ్డి  ఆంచల్  ఆధ్వర్యంలో బాన్సువాడ పట్టణంలోని  ఏకల్ అభియాన్ కార్యాలయంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు గాజుల రాజులు గారి ఆధ్వర్యంలో గురుపూజోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కే కోటేశ్వరరావు ఉత్తర తెలంగాణ సంభాగ్ ప్రశిక్షణ ప్రముఖ్ కార్యక్రమాన్ని ఉద్దేశించి సృష్టిలో గురువు యొక్క ప్రాముఖ్యతను మానవ జీవితంలో గురువు ప్రాధాన్యతను తెలియచేశారు. ఈ కార్యక్రమంలో సంచ్ స్థాయి,ఆంచల్ స్ధాయి ప్రముఖులు  భారతి ,రాధా శంకర్,అంజయ్య తదితరులు పాల్గొన్నారు.