29 July, 2026 | 8:14 PM

గురుపౌర్ణమి సందర్భంగా ఆధ్యాత్మిక గురువులకు ఘన సత్కారం

29-07-2026 07:05 PM

నర్సాపూర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్. రామచంద్రరావు ఆదేశాలు, తెలంగాణ ఎండోమెంట్ (ధార్మిక) సెల్ సూచనల మేరకు మెదక్ జిల్లాలో గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగంపేట పీఠాధిపతి శ్రీ మదవానంద స్వామీజీతో పాటు శ్రీ ఆంజనేయ శర్మ, శ్రీ చెలిమేటి సంజీవులు, శ్రీ వీరప్ప గురుస్వామి, శ్రీ వామని పంతులు, శ్రీ వెంకటేశ్వర శర్మలను శాలువాలు కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్, కౌన్సిలర్లు నిరంజన్, రమేష్ గౌడ్, రామ్ రెడ్డి, గుండం శంకర్, సంఘసాని రాజు, నరేష్ గౌడ్ పాల్గొన్నారు. రాష్ట్ర ఎండోమెంట్ సెల్ జాయింట్ కన్వీనర్ కవితా రెడ్డి, జిల్లా కన్వీనర్ తాళ్ల విజయ్, కో-కన్వీనర్ ప్రసాద్ రెడ్డి, జాయింట్ కన్వీనర్లు నవీన్, కృష్ణ, వీరారెడ్డి తదితరులు హాజరయ్యారు.