12 May, 2026 | 8:58 PM

Breaking News

హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •   నిర్మాణ రంగంలో ముడి సరుకుల ధరలకు అనుగుణంగా నూతన ధరలు చెల్లించండి   •  

రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

03-11-2025 02:14 AM
  1. యాదాద్రి జిల్లా బీబీనగర్‌లో రోడ్డు పక్కన బైక్‌తో సహా ఆగిన జంట
  2. 150 కి.మీ వేగంతో వచ్చి ఢీకొన్న కారు
  3. అక్కడికక్కడే భర్త, చెరువులో ఎగిరిపడి భార్య దుర్మరణం
  4. ముక్కలైన బైక్, నుజ్జు నుజ్జు అయిన కారు
  5. మద్యం మత్తులో కారునునడిపిన యువకుడు!

యాదాద్రి భువనగిరి, నవంబర్ 2 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా హైదరాబాద్ జాతీయ రహదారి బీబీనగర్ చెరువు కట్టపై ఉన్న రోడ్డులో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కకు ఆగి ఉన్న బైక్‌ను 150 కి.మీ.ల వేగంతో వచ్చిన కారు ఢీకొనడంతో దంపతులిద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. యాదాద్రి జిల్లా రాజాపేటకు చెందిన గర్దాస్ ప్రశాంత్(32)కు, వరంగల్‌లోని పాలకుర్తికి చెందిన ప్రసూన(28)కు మూడేళ్ల క్రితం పెళ్లుంది. ఉపాధి కోసం బోడుప్పల్‌లోని టెలిఫో న్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆదివారం ఉద యం బైక్‌పై సొం తూరుకు దంపతులిద్దరు బైక్‌పై బయలుదేరారు. బీబీనగర్ చెరువుకట్ట వద్దకు చేరుకో గానే ఫోన్ రావడంతో పక్కకు నిలిపి మాట్లాడుతున్నారు.

వెనక నుంచి 150కి.మీ వేగంతో దూసుకొచ్చిన కారు వారిని ఢీకొట్టింది. ప్రసూన ఎగిరి చెరువుకాలువలో పడి మృతి చెందింది. 20 అడుగుల దూరంలో ప్రశాం త్ పడి మృతిచెందాడు. బైక్ ముక్కలు కాగా తార్ వాహనం చెట్టుకు ఢీకొట్టి సర్వీస్ రోడ్డుపై పల్టీ కొట్టి నుజ్జునుజ్జయింది. వాహనంలో ఉన్న ముగ్గురు యువ కులకూ గాయాలయ్యాయి. ఆ ముగ్గురు యువకులు మద్యంతాగి, అతివేగంగా డ్రైవింగ్ చేయడం తోనే జరిగినట్టు తెలుస్తున్నది. యువతి మృతదేహాన్ని ఎన్డీఎఫ్ సిబ్బంది చెరువులో గాలించి, బయటకు తీశారు. మృతదేహాలను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలిం చారు. బీబీనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.