27 July, 2026 | 6:08 PM

Breaking News

ఐదెకరాల ప్రభుత్వ భూమి కబ్జా..   •   బీజిలిపూర్ ఎస్సీకాలనీ కరెంట్ సమస్య పరిష్కరించరా?   •   అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   భాగీరథిపల్లిలో రూ.25 లక్షల కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ   •   ఇల్లందు ఏరియాలో సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ల కౌన్సిలింగ్ నిర్వహణ   •   నేరేడుచర్లలో భాజపా ఆధ్వర్యంలో " సర్" ప్రక్రియపై సమీక్ష   •   రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి   •   ఎక్స్‌టార్షన్‌కు పాల్పడిన నిందితులు అరెస్ట్.. రిమాండ్   •   తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ   •   ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి   •  

యాదాద్రి హుండీ ఆదాయం లెక్కింపు

05-06-2026 12:46 AM

యాదగిరిగుట్ట, జూన్ 4 (విజయక్రాంతి): తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదా ద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి 30 రోజుల హుండీ ఆదాయం రూ. 3,18,37,261 సమకూరిందని గురువారం ఈవో భవాని శంకర్ తెలిపారు. గణాంకాలు వచ్చాయన్నారు.

కొం డకింద వ్రతమంటపంలో ఆదాయం లెక్కించామన్నారు. 12 దేశాల విదేశీ కరెన్సీ, 0.179 గ్రాముల బంగారం, మూడు కిలోల వెండి వచ్చినట్లు తెలిపారు. స్వామివారిని కర్ణాటక రాష్ట్రానికి చెందిన భీమకంటేమఠం పీఠాధిపతులు రఘునరేంద్ర తీర్థస్వామి దర్శించుకు న్నారని చెప్పారు. వారికి కార్యనిర్వాహణాధికారి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం అనంతరం తీర్థప్రసాదాలను అందజేశామన్నారు. ఈ దివ్యక్షేత్రంలో నిత్య పూజా కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నామని ఈవో వివరించారు.