calender_icon.png 22 February, 2026 | 4:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విప్ ధిక్కరణ.. కౌన్సిలర్‌పై వేటు

22-02-2026 01:02:28 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్‌ప ర్సన్, వైస్ చైర్‌పర్సన్‌ల ఎన్నికల సందర్భం గా విప్‌ను ధిక్కరించి ఓటింగ్ చేసినందుకు 13వ వార్డు కౌన్సిలర్ (కాంగ్రెస్ పార్టీ) గుండా స్నేహను కౌన్సిలర్ పదవికి అనర్హురాలిగా ప్రకటించారు. ఈ నెల 16న జరిగిన ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్‌తో గెలుపొందిన గుండ స్నేహ బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలిపారు.

విప్ జారీచేసిన నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు విప్ ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోసం నియమితులైన ప్రత్యేక అధికారి, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ లోకేశ్వ రరావు  షోకాజ్ నోటీసు జారీ చేయగా, దీనికి ఆమె సమర్పించిన వివరణను పరిశీలించిన అనంతరం విప్ ధిక్కరణ కింద కౌన్సిలర్ పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.