22-02-2026 01:04:40 AM
అధ్యక్షుడిగా డి.కిషన్ ప్రసాద్, కార్యదర్శిగా ఎన్.శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): తెలంగాణ గెజిటెడ్ అధికారుల వాణిజ్య పన్నుల శాఖ ఫోర మ్ అధ్యక్షుడిగా డి.కిషన్ ప్రసాద్, కార్యదర్శిగా యన్. శ్రీనివాసరెడ్డి ఎన్నికయ్యారు. శనివారం నాంపల్లిలోని టీజీవో భవన్‌లో తెలంగాణ గజిటెడ్ అధికారుల వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్ర ఫోరమ్ ఎన్నికలు నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
ఫోరమ్ అసోసియేట్ అధ్యక్షుడిగా యస్. మధుసూధనాచారి, ఉపాధ్యక్షులుగా కేశవులు, ఎస్.వెంకట్ నర్సింహ, వెల్ది ఇందిర, గుంటి భిక్షపతి, కోశాధికారిగా యం. సతీష్, జాయింట్ సెక్రటరీలుగా ఎండీ. మూస, బీ.మోహన్, వి.పద్మావతి, టీ.హరిప్రసాద్ ఆర్గనైజింగ్ సెక్రటరిగా పి.రమేష్ గౌడ్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్‌గా ఎస్. రాకేష్‌రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. ఎన్నికైన కార్యవర్గాన్ని ఉద్దేశించి తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధానకార్యదర్శి బీ.శ్యామ్ మాట్లాడుతూ ఎన్నికైన నాయకులు చిత్తశుద్ధితో పనిచేసి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.