8 August, 2026 | 3:06 PM

పింఛన్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

08-08-2026 01:50 PM

అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల

టేకులపల్లి, (విజయక్రాంతి): వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, నేత కార్మికులు, ఫైలేరియా వ్యాధిగ్రస్తులు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని టేకులపల్లి ఎంపీడీఓ కొండపల్లి శ్రీదేవి శనివారం విలేకరులకు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

వివిధ పింఛన్లకు అర్హతలు – కావాల్సిన ధృవీకరణ పత్రాలు

🔹 వితంతు పింఛను:

18 సంవత్సరాలు నిండి ఉండాలి. భర్త మరణ ధృవీకరణ పత్రం (డెత్ సర్టిఫికేట్), రూ.1,50,000 లోపు ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాలి.

🔹 ఒంటరి మహిళ పింఛను:

18 సంవత్సరాలు నిండి ఉండాలి. విడాకుల పత్రం, మండల రెవెన్యూ అధికారి (MRO) ధృవీకరణ పత్రం, రూ.1,50,000 లోపు ఆదాయ ధృవీకరణ పత్రం ఉండాలి.

🔹 వికలాంగుల పింఛను:

వయసుతో సంబంధం లేకుండా కనీసం 40 శాతం అంగవైకల్యం ఉన్నవారు అర్హులు. చెవిటి వారికి 50 శాతం అంగవైకల్యం ఉండాలి.

🔹 గీత కార్మికుల పింఛను:

50 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. గీత కార్మిక సొసైటీ సర్టిఫికేట్ సమర్పించాలి.

🔹 నేత కార్మికుల పింఛను:

50 సంవత్సరాల వయస్సు ఉండాలి. హ్యాండ్‌లూమ్ డిపార్ట్‌మెంట్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

ఇతర నిబంధనలు

▪️ దరఖాస్తుదారుల వార్షిక ఆదాయం రూ.1,50,000 మించకూడదు.

▪️ మెరక భూమి 7.5 ఎకరాలకు మించకూడదు.

▪️ దరఖాస్తు కోసం సంబంధిత పంచాయతీ కార్యదర్శిని సంప్రదించాలి.

▪️ మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి ద్వారా ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తి చేస్తారు.

▪️ ఆన్‌లైన్ దరఖాస్తు అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించి అర్హత ఉన్న వారికి పింఛన్లు మంజూరు చేస్తారు. ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్ల మంజూరు లేదని,

ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్ల మంజూరు ప్రక్రియ లేదని ఎంపీడీఓ కొండపల్లి శ్రీదేవి స్పష్టం చేశారు. అర్హులైన లబ్ధిదారులు సంబంధిత పంచాయతీ కార్యదర్శులను లేదా టేకులపల్లి మండల పరిషత్ కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆమె సూచించారు.