10-02-2026 12:51:23 AM
ప్రలోబాలు, నజరానాలపైనే భరోసా..
నిజాయితీ పరులపై ఓటర్లు కన్ను..
బెల్లంపల్లి, ఫిబ్రవరి 9 : బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి బరిలో ఉన్నా.. విజయావకాశాలపై ప్రజల్లో పెద్దగా చర్చ జరుగుతుంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల నుంచి పలువురు ప్రముఖలు పోటీలో ఉన్నారు. 34 వార్డుల్లో ఆయా పార్టీల అభ్యర్థులతో సహా 173 మంది ఎన్నికల బరిలో ఉండ గా ప్రధాన పార్టీల నుంచి బరిలో దిగిన ప్రముఖుల పనితీరు, వారి రాజకీయ, వ్యక్తిగత జీవి తాలు, విశేషాలు ఈ సందర్భంగా చర్చకొచ్చా యి. గతంలో పలువురు మున్సిపల్‌కి ప్రాతినిధ్యం వహించిన వారు కూడా ఇందులో ఉన్నారు.
వారు తమ హయాంలో పట్టణంలో చేసిన అభివృద్ధి, హామీలు ఇచ్చి చేసినా, చేయ ని తదితర అంశాలపై కూడా ప్రజలు నెమరేసుకుంటున్నారు. కొత్తగా పోటీ చేస్తున్న మరి కొందరిపై కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి వారిలో కొందరు రియల్టర్లు, భూకబ్జాదారులు కూడా ఉన్నారు. ఇలాంటి చరిత్ర గల వారిలో కొత్త, పాత అభ్యర్థులు కూ డా ఉన్నారు.
మొత్తంగా ప్రముఖలు అనుకున్న వారంతా పూర్వ పరిపాలన సేవలు, వ్యక్తిగత ప్రొఫైల్ పరంగా ప్రజలు ఆత్మావలోకనం చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరిపై కూడా పూర్తి అనుకూల, వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. రిజర్వేషన్లను అనుసరించి నేరుగా కానీ వారి కుటుంబ సభ్యులను పోటీలో నిలిపారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రముఖ లీడర్లు అధికారం కోసం అర్రులు చాస్తున్నారు.
పోటీలో ప్రముఖులు, బంధుగణం..
బెల్లంపల్లి బల్దియా పోరులో ఈ సారి ప్రముఖలు, వారి బంధువులు రంగంలో ఉన్నారు. ప్రజల ఆశీర్వాదం కోసం నిత్యం వారి ముంగిట మోకరిల్లుతున్నారు. పోటాపోటీగా హామీలు, నజరానాలు ఎరగా వేస్తున్నా రు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మాజీ చైర్మన్ సూరిబాబు సతీమణి మాజీ చైర్ పర్సన్ మత్తమారి సరస్వతీ, ఎమ్మెల్యే గడ్డం వినోద్ అనుచరుడు దావ రమేష్ సతీమణి దావ స్వాతికి టికెట్ రాగా కావ్య జ్యోతికు కాంగ్రెస్ టికెట్ దక్కలేదు.
దీనితో ఆమె రెబల్ గా పోటీలో ఉన్నారు. ఈ ఇద్దరితో పాటు ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు మరో సమీప సహచరుడుగా ప్రచారంలో ఉన్న చిప్ప మనోహర్ సతీమణి చిప్ప అర్చన, బండి ప్రభాకర్ సతీమణి బండి ఉమలు ఉన్నారు. చైర్మన్ స్థానం లక్ష్యంగానే పోటీలో మహిళలున్నారు. ఇందు లో ఇద్దరు మాత్రమే ఛైర్మెన్ గిరిపై ప్రధానంగా గురి పెట్టారు. దావ స్వాతి పేరు మాత్రమే ఛైర్మె న్ అభ్యర్థిగా ప్రచారంలో ఉంది.
టికెట్ ఆశించి బంగపడిన మరో నాయకురాలు కావ్య జ్యోతి కాంగ్రెస్ రెబల్ గా గెలిచి తమ సత్తా చాటాలని చూస్తోంది. ఆమె కూడా గెలుపొంది చైర్ పర్స న్ పీఠాన్ని కైవసంపైనే ప్రత్యేక దృష్టి సారించా రు. గెలుపునే ఆమె ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. అయితే కావ్య జ్యోతి కి రెండు లక్ష్యా లు ఉన్నాయని తెలుస్తోంది. గెలవడం లేదా తనకు టికెట్ రాకుండా అడ్డుపడిన దావా స్వా తిని ఓడించి ప్రతీకారం తీర్చుకుని ఎమ్మెల్యేపై తన పంతం నెగ్గించుకోవడం.
ఇలా ఇద్దరి మధ్య ఏడవ వార్డులో యుద్దమే సాగుతుంది. కాంగ్రెస్ లీడర్లు గెల్లి రాయలింగు కూతురు సంధ్య, ఢీకొండ రాయలింగు భార్య ఢీకొండ పద్మ ఎన్నికల బరిలో ఉన్నారు. ఇలా ఉండగా బీఆర్‌ఎస్ మున్సిపల్ మాజీ ఛైర్మన్ సుదర్శన్ భార్య బత్తుల అనితను ఈసారి తన వార్డు 17 నుంచి కాకుండా 18 వార్డు నుంచి పోటిలో ఉంచారు. గెలుపోటమీలపై అనుమానం ఉం ది. దీంతో ఆయన కొత్త వార్డును ఎంచుకున్నారు.
తన పాత వార్డును పాత మిత్రుడు బీ ఆర్ ఎస్ రాజకీయాలకు దగ్గరగా ఉండే రాగంశెట్టి సత్యనారాయణ కాంగ్రెస్ నుంచి పోటీ లోకి దిగారు. బేసిక్‌గా ఈయన గతంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రధాన అనుచరుడు. బీఆర్‌ఎస్ వెన్నుదన్నుగా ఉండే వారని ప్రచారం ఉంది. వృత్తి రీత్యా పెద్ద రియల్టర్, అనూహ్యంగా కాంగ్రెస్ అభ్యర్థిగా తెరకెక్కారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ తో మంతనాలు భారీ అగ్రిమెంట్ తో ఏకంగా కాంగ్రెస్ పార్టీ తరుపున మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. 17వ వార్డు నుంచి నామినేషన్ వేశారు. ప్రస్తుతం ఉన్న అభ్యర్థుల్లో ఈయనే పెద్ద రిచ్ క్యాండిడేట్‌గా ప్రచా రం ఉంది.
సమాజంలో ప్రధాన పార్టీల ప్రముఖులుగా చలామణిలో ఉన్న ఈ నేతలు పట్ల ప్రజల్లో రకరకాల విభిన్నాభిప్రాయాలు, ఆరోపణలు మాత్రం ఉన్నాయని తెలుస్తోంది. అధి కారంలో ఉండగా, అడ్డగోలు ప్రజా వ్యతిరేక పనులు, వెరసి ప్రజా అవిశ్వాసం నీడలా వెం టాడుతుందినీ పరిశీలకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో అనుకున్నంత వైట్ కాలర్లు, సాఫ్టు క్యారెక్టర్ నేతలు కారనే ప్రచారం ప్రజల్లో బలంగా వ్యక్తమవుతుంది. ఈ ఎన్నికల్లో ఎవరినీ ఆదరిస్తారో చూడాలిమరి.