11 May, 2026 | 1:00 PM

Breaking News

బంగారం కొనుగోళ్లపై దేశప్రజలకు హెచ్చరించిన ప్రధాని మోదీ   •   చంబాలో లోయలో పడిన కారు: ఆరుగురు గుజరాత్‌ పర్యాటకులు మృతి   •   మేడ్చల్‌లో విషాదం: కౌకూర్ చెరువులో అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం   •   అమ్మ ఒడి కార్యక్రమంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు   •   ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •  

మద్నూర్‌లో కాటన్ అసోసియేషన్ సభ్యుల నిరసన

18-11-2025 12:00 AM

బిచ్కుంద, నవంబర్ 17 (విజయ క్రాంతి) : కామారెడ్డి జిల్లా మద్నూర్ మార్కెట్లో సోమవారం పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఉదయం నుంచి పత్తి జిన్నింగ్ మిల్లుల ఎలాంటి కొనుగోలు సందడి లేకుండా పోయింది. రాష్ట్ర కాటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్1, ఎల్2, ఎల్ 3 సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరవధికంగా పత్తి కొనుగోలు నిలిపివేశారు.ప్రతి రోజు తెల్లవారుజాము నుంచి పత్తి వాహనాల సందడి ఉండేది.

సోమవారం వచ్చిన కొన్ని వాహనాలు సైతం వెనక్కి వెళ్లాయి. కాటన్ అసోసియేషన్ సభ్యులు జిన్నింగ్ మిల్లు గేటు మూసి నిరసన చేపట్టారు. ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 సమస్యను పరిష్కారం అయ్యే వరకు సీసీఐ, ప్రైవేటులో నిరవధికంగా పత్తి కొనుగోళ్లు చేయమని స్పష్టం చేశారు. మిల్లులో నిబంధనలు లేకుండా సీసీఐ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోరాజేష్ కాకాని, మధుకర్, గురురాజ్ చిద్రవార్, జ్ఞానేశ్వర్, సుమిత్, గిరిష్, అక్షయ్ పాల్గొన్నారు.