14 July, 2026 | 11:00 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. కత్తులు దూస్తున్న ఇరాన్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

కామారెడ్డి మున్సిపాలిటీలో అవినీతిని అడ్డుకుంటా

16-02-2026 09:09 PM

మూడు సంవత్సరాల వరకు అవినీతి జరగదు

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి మున్సిపాలిటీలో అవినీతి తావు లేకుండా పాలన సాగేలా చూస్తానని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో 16 బిజెపి కౌన్సిలర్లను గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కామారెడ్డి మున్సిపల్ పాలకవర్గం ప్రమాణస్వీకారం కార్యక్రమానికి హాజరై అనంతరం మీడియాతో మాట్లాడారు. మూడు సంవత్సరాల పాటు అవినీతికి పాల్పడకుండా అడ్డుకుంటానని ఎమ్మెల్యే తెలిపారు.

అధికారులు అధికార పార్టీ నాయకుల ఒత్తిడీలకు గురై సంతకాలు పెడితే బాధ్యత అధికారు లే వహించాల్సి వస్తుందని తెలిపారు. అవినీతిని అధికారులు ప్రోత్సహించవద్దని కోరారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మున్సిపాలిటీలో అవినీతి జరగకుండా చూస్తానన్నారు. బిజెపి అభ్యర్థులు ఓడిపోయిన స్థానాల్లో సైతం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే తో పాటు నూతనంగా ఎన్నికైన బిజెపి కౌన్సిలర్లు మోటూరి శ్రీకాంత్, రాహుల్ గౌడ్, నరేందర్ రెడ్డి, కాసర్ల రాణి, తదితరులు పాల్గొన్నారు.