భూ భారతి భూ రీ సర్వేకు సహకరించండి
జగదేవపూర్, ఏప్రిల్ 1: జగదేవపూర్ మండల పరిదిలోని గొల్లపల్లి గ్రామంలో మండల తాహశీల్దార్ నిర్మల ఆధ్వర్యంలో భూభారతి భూ రీ-సర్వేపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో అత్యాధునిక రోవర్లు, డ్రోన్ల సహాయంతో భూముల డిజిటల్ మ్యాపింగ్ చేయడం, ప్రతి భూకమతానికి 11 అంకెల విశిష్ట భూధార్ సంఖ్యను కేటాయించడం, పాత సరిహద్దు వివాదాలను పరిష్కరించి రైతులకు స్పష్టమైన యాజమాన్య హక్కులు కల్పించడం జరుగుతుంది అన్నారు.
ఈ ప్రక్రియలో రైతులందరూ తమ రికార్డులతో సర్వే బృందాలకు సహకరించాలని తెలిపారు. అనంతరం గ్రామ సర్పంచ్ మహేందర్ యాదవ్ మాట్లాడుతూ గ్రామంలోని రైతులకు సర్వే 101 ప్రత్యేక ద్రుష్టి పెట్టి రైతులకు న్యాయం చేయాలి అని కోరారు. కొంత మంది రైతులకు భూమి ఉన్న పట్టా పాస్ బుక్ లు లేవని మరి కొంత మందికి భూములు ఉన్న రికార్డు ఎక్కువ తక్కువలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఏ డి ఆర్ సుదర్శన్, గజ్వెల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, రెవెన్యూ ఆర్ ఐ ఎం డి ఫహెద్, రెవెన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.




