ప్రజల భాగస్వామ్యంతో రోడ్డు ప్రమాదాల నియంత్రణ సాధ్యం
ఆపరేషన్స్ డీజిపీ అనిల్ కుమార్
జనగామ, జూన్ 10 (విజయక్రాంతి): ప్రజల భాగస్వామ్యం, సహకారంతోనే రోడ్డు ప్రమాదాలను నియంత్రించగలమని డిజిపి అనిల్ కుమార్ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యచరణలో భాగం వరంగల్ కమిషనరేట్ పోలీ సుల ఆధ్వర్యంలో జనగామ జిల్లా కేంద్రంలోని మాంగళ్య కల్యాణ వేదికలో అరైవ్ అ లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ముఖ్య అతిధి ఆపరేషన్స్ డీజిపీ అనిల్ కుమార్ తో పాటు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీ త్ సింగ్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముం దుగా ముఖ్య అతిధుల చేతుల మీదుగా జ్యో తి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్బంగా కార్యక్రమానికి హాజ రైన స్థానిక ప్రజలు, యువత ఉద్దేశిస్తూ డిజి పి మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా గతం లో 1లక్ష73 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మ రణిస్తున్నారని, దీని కారణంగా దేశ జీడీపీ 3 శాతం నష్టం జరుగుతోందని. మన తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది 7వేలకు పై ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో మరణించారని. దీని కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ఎన్ని భారీ ప్రమాదాలు జరిగిన ప్రజ ల్లో మార్పు రావడంలేదని, విదేశాల్లో ట్రాఫి క్ రూల్స్ అతి కఠినంగా ఉంటాయని అక్కడ ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే వీళ్ళల్లో జరిమాలను విధించబడతాయని, కానీ మనదేశంలో మాత్రం ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే తక్కువగా జరిమానాలు విధించడం ద్వారా వాహనదారులకు భయం లేదని,
మన దేశంలో రోడ్డు ప్రమాదాలకు ఇది కూడా ఒక కారణమని, ట్రాఫిక్ రూల్స్ మీ భద్రత కోసమ ని, ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబందనా లు పాటిస్తే ఎన్నో రోడ్డు ప్రమాదాలను నివారించగలమని, అరైవ్ అలైవ్ ముఖ్య ఉద్దేశం వాహన దారుడు స్వీయ రక్ష పాటిస్తూ క్షేమంగా గమ్య స్థానాలకు చేరుకోవడమే పో లీసుల ప్రధాన లక్ష్యమని, గత ఆరు నెలలు గా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా వరంగల్ కమిషనరేట్ పరిధిలో 15 శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గు ముఖం పట్టాయని, ప్రతి ఒక్కరు తమ వంతు భాద్యత భావిస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని ప్రజల భాగస్వామ్యంరోడ్డు ప్రమాదాలను నివారించగలమని డీజిపీ తెలిపారు.
వరంగల్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. మన రాష్ట్రం అలాగే రాష్ట్రంలో సం వత్సరంలో తొమ్మిది వందల హత్య జరుగుచుండగా, రోడ్డు ప్రమాదాల్లో మాత్రం ప్రతి సంవత్సరం సుమారు 8వేల మందికి పైగా మరణిస్తున్నారని ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయమని, ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనం నడపటం ద్వారా ఈ సమస్య పరిష్కరిం చుకోగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిపిలు రాజమహేంద్ర నాయక్, అంకిత్ కుమార్, ధార కవిత, అదనపు డిసిపి ప్రభాకర్ రావు, ఏసీపీలు భీమ్ శర్మ, నర్సయ్య, సత్యనారాయణ, వెస్ట్ జోన్, ట్రాఫిక్ ఇన్స్ స్పెక్టర్లు, ఎస్‌ఐ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.






