30 July, 2026 | 3:29 PM

ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

30-07-2026 02:07 PM

కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, (విజయక్రాంతి) : ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అత్యవసర సహాయం అందించేందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా గురు వారం తెలిపారు. వర్షాలు, వరదలకు సంబంధించిన అత్యవసర పరిస్థితులు లేదా సహాయం అవసరమైన సందర్భాల్లో ప్రజలు టోల్‌-ఫ్రీ నంబర్ (1800 425 1939)ను సంప్రదించాలని సూచించారు. కంట్రోల్ రూమ్‌లో సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండి ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసి తక్షణ చర్యలు చేపడతారన్నారు. ప్రజలు అనవసర ప్రయాణాలు చేయకుండా, వాగులు, లోతట్టు ప్రాంతాలు, వరద ప్రవాహాల వద్దకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని, జిల్లా యంత్రాంగం జారీ చేసే సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.