22 March, 2026 | 2:33 PM

కొండాపూర్‌లో డ్రైనేజీ పనులకు శ్రీకారం

22-03-2026 12:53 PM

పదేళ్ల నిరీక్షణకు తెర… 

- సర్పంచ్ వంకాయల గౌతమి ప్రశాంత్

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామంలో గత పదేళ్లుగా ప్రజలను వేధిస్తున్న డ్రైనేజీ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం దిశగా అడుగులు పడాయి. గ్రామంలోని 7వ వార్డులో నేవురి దేవరాజు ఇంటి పరిసరాల్లో నెలకొన్న మురుగునీటి సమస్యను నివారించేందుకు గ్రామ సర్పంచ్ వంకాయల గౌతమి ప్రశాంత్ ఆధ్వర్యంలో కొత్త డ్రైనేజీ పైప్‌లైన్ నిర్మాణ పనులు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ పనులను సర్పంచ్ గౌతమి ప్రశాంత్, ఉప సర్పంచ్ పూండ్ర రాజిరెడ్డి, వార్డు సభ్యులు శాస్త్రోక్తంగా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, పదేళ్లుగా డ్రైనేజీ సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, సమస్య తమ దృష్టికి వచ్చిన వెంటనే నిధులు కేటాయించి పనులను ప్రారంభించామని తెలిపారు. ఎన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యకు పరిష్కారం దొరకడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ అభివృద్ధిలో రాజీ పడకుండా, మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పాలకవర్గం ముందుకు సాగుతుందని సర్పంచ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పూండ్ర రాజిరెడ్డి, గ్రామ పాలకవర్గ సభ్యులు, వార్డు ప్రతినిధులు, స్థానికులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.