22 March, 2026 | 2:19 PM

సిమెంట్ ట్యాంకర్ ఢీకొని వ్యక్తి మృతి

22-03-2026 12:56 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): సిమెంట్ ట్యాంకర్ ఎదురుగా బైక్‌ను ఢీ కొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం పోలవరం వద్ద శనివారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన కొండా దేవా(25) వ్యక్తిగత పనుల నిమిత్తం భద్రాచలం నుండి ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా, మార్గమధ్యలోని పోలవరం గ్రామం వద్ద అతివేగంగా ఎదురుగా వచ్చిన సిమెంట్ ట్యాకంర్ ఇతన్ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.