27 June, 2026 | 2:17 AM

చినుకు పడితే చిత్తడే..

27-06-2026 12:58 AM

స్నేహిత హిల్స్‌లో సీసీ రోడ్లు నిర్మించండి

రాజేంద్రనగర్, జూన్ 26 (విజయక్రాంతి): రాజేంద్రనగర్ నియోజకవర్గం పిరం చెరువు శివారులోని స్నేహిత హిల్స్ కాలనీ వాసులు ప్రతిరోజు సమస్యలతో సతమతమవుతున్నారు. మంచినీరు డ్రైనేజీ సమ స్యలతో పాటు ప్రధానంగా సిసి రోడ్లు లేక గుంతలమైన రోడ్లతో కాలనీలో నివాసం ఉండే  వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

కాలనీలో పెద్దపెద్ద అపార్ట్మెంట్లు నిర్మి స్తున్నారు కాలనీ దినదినాభివృద్ధి చెందుతున్నప్పటికీ సౌకర్యాలు మాత్రం అనుకున్న స్థాయిలో ప్రభుత్వం కల్పించడం లేదు ప్రభుత్వానికి పెద్దఎత్తున టాక్స్‌ల రూపంలో డబ్బులు చెల్లిస్తున్నప్పటికీ ఇక్కడ మాత్రం సమస్యలు రాజ్యమేలుతున్నాయి.

గత కొన్ని రోజుల క్రితం జిహెచ్‌ఎంసి రాజేంద్రనగర్ సర్కిల్ అధికారులు సిసి రోడ్లు నిర్మించేందుకు కొలతలు కూడా తీసుకెళ్లారు కానీ ఇటీవల స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ నియోజకవర్గంలోని పాత బండ్లగూడ జాగిర్ ము న్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కాలనీలలో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కానీ స్నేహిత హిల్స్ లో సిసి రోడ్లకు నిధులు మంజూరు కాలేదు వర్షం వచ్చిందంటే ఈ కాలనీలో ప్రయాణం నరకంగా మారుతుంది. బురద గుంటలతో ఎప్పుడు ప్రమాదం చోటు చేసుకుంటుందో తెలియని పరిస్థితి ఉంది. స్థానిక ఎమ్మెల్యే. అధికారులు స్పందించి సీసీ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని స్నేహిత హిల్స్ కాలనీ వాసులు కోరుతున్నారు.