వివాహితపై కానిస్టేబుల్ వేధింపులు
కేసు నమోదు చేసిన చైతన్యపురి పోలీసులు
ఎల్బీనగర్, జూన్ 28 : వివాహితను వేధింపులకు గురిచేసిన కానిస్టేబుల్ పై చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే... నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన డి.నాగలక్మి (30) భర్త ఆంజనేయులతో కలిసి చైతన్యపురి డివిజన్‌లోని హను మాన్ నగర్‌లో నివసిస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా, 2020లో అమరావతి అపార్ట్మెంట్స్లో ఉన్న సమయం లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఇక్కలూరి వెంకటేష్ (35)తో నాగలక్ష్మికి పరిచయం ఏర్పడింది.
దీంతో ప్రతిరోజూ ఇద్దరు ప్రేమించుకుని వివాహేత ర సంబంధం పెట్టుకున్నారు. భర్తకు విష యం తెలియడంతో రాంనగర్‌కు వెళ్లారు. అక్కడ కూడా భర్త ఇంట్లో లేని సమయాల్లో వెంకటేశ్ ఆమెతో శారీరకంగా కలుసుకునేవారు. ఆ సమయంలో ఫొటోలు, వీడియో లను వెంకటేశ్ తీసుకున్నాడు. ఆ తర్వాత, నవంబర్ 2020లో ఇద్దరు కలిసి చైతన్యపురిలోని హనుమాన్ నగర్లో లేడీస్ హాస్టల్ ను ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న భర్త భార్యను తల్లిగారింటికి పంపిం చాడు.
2024లో పెద్దమనుషుల నచ్చచెప్పడంతో భర్తతో కలిసి నాగలక్ష్మి చైతన్యపురి లో ఉంటున్నారు. అయినప్పటికీ... వెంకటేష్ చైతన్యపురిలో నాగలక్ష్మి పనిచేస్తున్న ఆఫీసుకు వచ్చి తన దగ్గర ఫొటోలు వీడియోలు ఉన్నాయని, వేధింపులకు గురి చేస్తు న్నాడు. వేధింపులు భరించలేక భర్తతో కలిసి చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






