రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి
16-04-2026 01:15 AM
సూర్యాపేట, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన సూర్యాపేట రూరల్ పరిధి ఇమాంపేట సమీపంలో బుధవారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం హుజూర్ నగర్‌కు చెందిన వల్లపు దాసు సైదులు (43) సూర్యాపేటలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
సాయంత్రం గరిడేపల్లి మండలంలోని పొనుగోడు నుంచి సూర్యాపేట వైపు బైక్‌పై వస్తున్న క్రమంలో ఇమాంపేట రోడ్డుకు సమీపంలో ముందున్న వరి కోత మిషన్ ట్రాలీని ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సైదు లు అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. విష యం తెలుసుకున్న సూర్యాపేట రూరల్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. సైదులుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.






