calender_icon.png 14 February, 2026 | 12:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాండూర్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం

13-02-2026 07:36:40 PM

ఇది ప్రజా విజయం... పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం...ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.

తాండూరు, 13 ఫిబ్రవరి, (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. శుక్రవారం పట్టణంలోని సెయింట్ మార్క్స్ జూబ్లీ హై స్కూల్ లో జరిగిన మున్సిపల్ ఓట్ల లెక్కింపు హోరాహోరీగా సాగింది. 36 వార్డులకు గాను మూడు రౌండ్లలో ఒక్కో రౌండ్ కు 12 వార్డులను లెక్కించారు. టగ్ ఆఫ్ వార్ గా సాగిన కౌంటింగ్ లో నువ్వా నేనా అన్నట్టుగా ఫలితాలు రావడంతో కాసేపు ఉత్కంఠగా మారింది. టిఆర్ఎస్ పార్టీ నుండి చైర్ పర్సన్ అభ్యర్థిగా ప్రకటించిన సాయిపూర్  పట్లోళ్ల నర్సింలు ఓటమిపాలయ్యారు. 36 వార్డులకు గానువికారాబాద్ జిల్లా మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది .

36 వార్డులకు గాను మున్సిపల్ ఎన్నికల  ఫలితాలు

కాంగ్రెస్ పార్టీ ,19 

బి ఆర్ ఎస్ ,12 

బీజేపీ,3

ఎంఐఎం ,1

ఇండిపెండెంట్ 1 గెలుపొందారు. చైర్ పర్సన్ ను ఎన్నుకోవడానికి కావలసిన 19 మంది కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించి మెజారిటీ సాధించడంతో చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీకి వరించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఇది ప్రజా విజయమని అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని.. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలని రానున్న రోజుల్లో పట్టణాన్ని, నియోజకవర్గాన్ని మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేస్తామని అన్నారు.