బీసీలకు అన్యాయం చేసిన కాంగ్రెస్
- కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలి
- రూ.50 వేల కోట్లకు బీసీ బడ్జెట్ పెంచాలి
- బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ టీ చిరంజీవులు
ముషీరాబాద్, మార్చి 22( విజయక్రాంతి): బడ్జెట్‌లో బీసీలకు తీరని అన్యా యం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే బీసీలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి టీ. చిరంజీవులు, ఫోరం కన్వీనర్లు ఐలు వెంకన్న గౌడ్ ఎలికట్టే విజయకుమార్ గౌడ్, అంబాల నారాయణ గౌడ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యా ప్తంగా బీసీలను చైతన్యవంతం చేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.
ఈ మేరకు ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో రాష్ట్ర బడ్జెట్‌లో ’బీసీలకు తీవ్ర అన్యాయం’పై జరిగిన సదస్సు కు ఎస్. దుర్గయ్య గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న మాదరిగానే బీసీలకు ’బీసీ సబ్’ ప్లాన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ బడ్జెట్ లో ఇప్పటికైనా బీసీలకు రూ.50 వేల కోట్లు కేటాయించాలని కోరా రు.
రాష్ట్ర జనాభాలో సగానికి పైగా బీసీలు ఉన్నారని, వారు అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్నప్పటికీ అభివృద్ధిలో మాత్రం ప్రభుత్వం మొండి చెయ్యి చూపించిందని విమర్శించారు. బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాల గోని బాలరాజ్ గౌడ్, కన్వీనర్లు ఎలికట్టె విజ య్ కుమార్, అయిలు వెంకన్న గౌడ్‌లు మా ట్లాడుతూ బీసీలను ప్రభుత్వానికి చిన్నచూపు చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో బీసీ నేతలు అంబాల నారాయణ, శ్రీకాంత్, కైలాష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.




