12 July, 2026 | 12:22 PM

మృతదేహానికి ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు

12-07-2026 11:21 AM

గుండాల,(విజయక్రాంతి): మండల పరిధిలోని రోళ్లగడ్డ గ్రామపంచాయతీ నర్సాపురం గ్రామానికి చెందిన దుగ్గి సుధాకర్ అకాల మరణ వార్త తెలుసుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ పొంబోయిన ముత్తయ్య మరియు జిల్లా కార్యదర్శి ఎస్కే ఖదీర్ లు వారి నివాసానికి వెళ్లి సుధాకర్ మృతదేహనికి ఘన నివాళులర్పించారు. మృతుడు రెండు సార్లు బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై, నెలల తరబడి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జీవన పోరాటం సాగించాడని, ఆయనను కాపాడుకోవడానికి మేము ఎంతో శ్రమించి, భారీగా ఖర్చు చేసినప్పటికీ బ్రతికించుకోలేక పోయామని కుటుంబ సభ్యులు జిల్లా కార్యదర్శి ఖదీర్ తో చెప్పుకుంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. సుధాకర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, కుటుంబ సభ్యులను ఓదార్చి, దైర్యం చెప్పి, కాంగ్రెస్ పార్టీ తరుపున ఆదుకుంటామని ఈ సందర్భంగా ఖధీర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రోళ్లగడ్డ గ్రామపంచాయతీ సర్పంచ్ భూక్య మంగమ్మ, కాంగ్రెస్ పార్టీ నాయకులు వాంకుడోత్ బీకోజీ, భూక్య శ్రీను, సనప సీతారాములు, నూనావత్ రవి, బొంగు చంద్రశేఖర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.