కిన్నెర శ్రీను కుటుంబానికి ఆర్థిక సహాయం
గుండాల,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం గుండాల మండల పరిధిలోని శంభునిగూడెం గ్రామ పంచాయతీ సర్వాపురం గ్రామానికి చెందిన కిన్నెర శ్రీను కొన్ని రోజుల క్రితం అనుమానస్పదంగా మృతి చెందాడు. శనివారం శంభునిగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఈసం సుమలత, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈసం రాజబాబు పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్ల ఆదేశాల మేరకు కిన్నెర శ్రీను కుటుంబాన్ని పరామర్శించి, బాధిత కుటుంబానికి పార్టీ తరుపున అండగా నిలుస్తామని హమీ ఇచ్చారు. అనంతరం శ్రీను దశదిన కర్మలకు కుటుంబ సభ్యులకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ దొర కిన్నెర కృష్ణ, పటేల్ పూనెం రాంబాబు, కిన్నెర అరుణ్, కిన్నెర బాబు, కిన్నెర రమేష్, పొడుగు జార్జి తదితరులు పాల్గొన్నారు.






