12 July, 2026 | 12:25 PM

మంత్రాలయం–పంచముఖి ఆంజనేయ స్వామి దర్శనానికి ప్రత్యేక డీలక్స్ బస్సు

12-07-2026 11:31 AM

వనపర్తి టౌన్: అమావాస్య సందర్భంగా భక్తుల సౌకర్యార్థం వనపర్తి డిపో ప్రత్యేక డీలక్స్ బస్సును ఏర్పాటు చేసింది. ఈ నెల 14వ తేదీ (మంగళవారం) వనపర్తి బస్టాండ్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరే ఈ బస్సు మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం, పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయాలను దర్శించుకొని మరుసటి రోజు ఉదయం వనపర్తికి తిరిగి చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక యాత్రకు ప్రతి ప్రయాణికుడికి రూ.600 చొప్పున చార్జీ నిర్ణయించారు. భక్తులు ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. టికెట్ రిజర్వేషన్ కోసం వనపర్తి బస్టాండ్ రిజర్వేషన్ కౌంటర్‌లో లేదా 7382829151, 7382829379 నంబర్లను సంప్రదించి బుకింగ్ చేసుకోవచ్చని డిపో అధికారులు తెలిపారు. అమావాస్య సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు యాత్రలో పాల్గొనే అవకాశం ఉన్నందున ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని కోరారు.