14-02-2026 12:45:33 AM
మధిర మున్సిపల్ ఎన్నికలలో చక్రం తిప్పిన మల్లు భట్టి విక్రమార్క
మొత్తం 22 వార్డులకు 21 వార్డుల్లో కాంగ్రెస్ పాగా
పది సంవత్సరాల తర్వాత మధిర మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా రెపరెపలు
మధిర అభివృద్ధికి ఓటు వేసిన ఓటర్లు
ఎర్రుపాలెం ఫిబ్రవరి 13 (విజయ క్రాంతి):మధిర మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో ఓటర్లు అభివృద్ధికి ఓటు వేశారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. మధిర మున్సిపల్ కు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 22 వార్డులలో పోటీ చేసి 21 వార్డులలో విజయ దుందుభి మోగించింది. మధిర మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా రెపరెపలాడునుంది. శుక్రవారం నాడు జరిగిన ఫలితాలు డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క తన రాజకీయ వ్యూహంతో ప్రతిపక్షాలకు ఒక వార్డుతో సరిపెట్టారు.
అన్నింట తానై తనను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నాయకులకు మధిర మున్సిపాలిటీలో వారిని పోటీకి నిలబెట్టి తన ప్రచార వ్యూహంతో అభ్యర్థులను గెలుపొందించారు. మధిర మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేనని పట్టుబట్టి ఓవైపు పార్టీ శ్రేణులను కదిలించారు, 50 సంవత్సరాలకు సరిపడా మధిర అభివృద్ధికి చేస్తున్న కృషిని ఓటర్లకు తానే స్వయంగా వివరించి వారి మనసు గెలిచి ఘన విజ యం సాధించారు. అన్ని తానై ముందుకు నడిచిన భట్టి విక్రమార్క తిరుగులేని ప్రజా నాయకుడని, తాను ఓ క్యాడర్ లీడర్ అని మరోసారి నిరూపించుకున్నారు.
ప్రజా ప్ర భుత్వం అధికారంలోకి వచ్చింది. డిప్యూటీ సీఎంగా ఆర్థిక, విద్యుత్తు మరియు ప్రణాళికా శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు చేతికి వ చ్చాయి. ఇదే అదునుగా తనను వరుసగా ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలిపించిన మ ధిర ప్రజల రుణం తీర్చుకునే అవకాశం ద క్కిందని భావించిన డిప్యూటీ సీఎం తన ఏళ్ల నాటికలను సాకారం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదిపారు.
రాజకీయ పొత్తులు, కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు, ఎన్నికల ప్రచారం, అభివృద్ధి ఎత్తుగడ ప్రతి అంశంలో అనుకున్నట్టు ముందుకు వెళ్లి అద్భుత విజయాన్ని ప్రజానాయకుడు భట్టి విక్రమార్క .మధిర మున్సిపాలిటీలో ఏ పార్టీ బలం ఎంతో వాస్తవంగా వివరించి టీడీపీతో కూటమిగా బరిలో దిగారు. 22 వార్డుల్లో టీ డీపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థులు మూ డు వార్డుల్లో పోటీలో నిలవగా, మిగిలిన 19 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీలో నిలబడ్డారు.
మొత్తం 22 వార్డుల్లో 21 వార్డుల్లో కాంగ్రెస్ పాగా వేసింది.తన గెలుపు కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు ఏ విధంగా శ్రమిస్తారో, అంతకుమించి మున్సిపాలిటీలో కాం గ్రెస్ కూటమి అభ్యర్థుల గెలుపునకు డిప్యూ టీ సీఎం శ్రమించి గొప్ప స్ఫూర్తిని నింపి తాను నిజమైన నాయకుడని నిరూపించుకున్నారు.తన బలం, బలహీనత కాంగ్రెస్ శ్రేణు లేనని నమ్మి వారికి బాధ్యతలు అప్పగించి నిత్యం పర్యవేక్షించారు.
వారు క్షేత్రస్థాయిలో చేయాల్సిన కార్యక్రమాలను దిశానిర్దేశం చేస్తూ ముందుకు నడిపించారు. పోటీ చేసిన అభ్యర్థులను కంటికి పాపలా కాపాడుకున్నారు. మరోవైపు స్వయంగా తానే ప్రచార రంగంలోకి దిగారు.ఎన్నికల ముందు నిర్వహించిన భారీ ర్యాలీతోనే మధిర మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని తేలింది. తాను డిప్యూటీ సీఎం చిన్న మున్సిపాలిటీలో ప్రచారం చేయడం అవసరమా? అనే బేసిజం లేకుండా వార్డుల వారీగా ప్రచారంలోకి దిగారు.
రాబోయే 50 సంవత్సరాల అవసరాలకు అనుగుణంగా మధిర పట్టణాన్ని తాను ఎలా అభివృద్ధి చేయబోతున్నానో అనే విషయాన్ని కళ్లకు కట్టినట్టు వివరించి ఓటర్లను మెప్పించారు. స్వచ్ఛమైన, సుందరమైన మధిర కోసం అండర్గ్రౌండ్ డ్రైనేజీ, అండర్గ్రౌండ్ కేబుల్ ద్వారా విద్యుత్తు, వరద నీటి ఇబ్బంది లేకుండా వైరా నదికి అడ్డంగా కరకట్ట, మధి ర పట్టణ విస్తరణకు హైదరాబాద్ తరహాలో ఔటర్ రింగ్ రోడ్ వంటి పనులకు అనుమతులు సాధించి వేగంగా పనులు చేపడుతున్న తీరును వివరించారు.
మధిర మున్సిపాలిటీపై తన రెండు రోజుల ప్రచారంతో డిప్యూటీ సీఎం ఓటర్ మహాశ యులను తన వైపు తిప్పుకున్నారు. మధిర పట్టణ ప్రజల మనసులు గెలిచారు. విక్రమార్కుని వ్యూహం ఫలించింది. 10 సంవత్స రాల రికార్డులు తారుమారు అయ్యాయి. మధిర మున్సిపాలిటీనీ కాంగ్రెస్ కూటమి ఏకపక్షంగా గెలుచుకొని విజయదుందుభి మోగించింది.