14-02-2026 12:46:04 AM
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఒక కార్పొరేషన్, రెండు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో 2 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. ఇల్లందు మున్సిపాలిటీ, అశ్వరావుపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయదొందిబి మోగించింది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌లో ఓటర్లు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీని ఇవ్వలేదు.
కొత్తగూడెం కార్పొరేషన్‌లో 60 డివిజన్లలో కాంగ్రెస్, సీపీఐ నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. కాంగ్రెస్ తన మిత్రపక్షమైన సీపీఎంతో కలిపి 23 డివిజన్లలో విజయం సాధించగా, సీపీఐ 22 డివిజన్లనో విజయకేతనం ఎగురవేసింది. కొత్తగూడెం కార్పొరేషన్ హస్తగతం చేసుకోవాలంటే 31 డివిజన్లలో మెజార్టీ సాధించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 8 డివిజన్లలో గెలపొందిన బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు కీలకంగా మారారు.
మొత్తం డివిజన్లు 60
కాంగ్రెస్ - 22
సీపీఐ - 22
బీఆర్‌ఎస్ - 8
సీపీఎం - 1
బీజేపీ - 1
స్వతంత్రులు 6