calender_icon.png 14 February, 2026 | 11:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉమ్మడి నల్లగొండలో పై‘చేయి’

14-02-2026 01:02:14 AM

నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు మరో 15 చోట్ల సత్తా చాటిన కాంగ్రెస్                               

పోచంపల్లిలో స్వల్ప మెజార్టీ,                               

తిరుమలగిరి చైర్మన్ పీఠం బి.ఆర్.ఎస్ కైవసం 

సూర్యాపేట, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): ఉమ్మడి నల్లగొండ జిల్లా మున్సి పాల్టీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యతను చాటుకుంది. నల్లగొండ కార్పోరేషన్ లో స్పష్టమైన మెజార్టీని సాధించింది. ఇక్కడ 48 స్థానాలకు గాను కాంగ్రెస్ 27, బీఆర్‌ఎస్ 9, బీజేపీ 4, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు 4, ఎంఐఎం 2, ఇండిపెండెట్లు 2 స్థానాలు గెలుచుకున్నారు. 17 మున్సిపాల్టీలలో తిరుమలగిరి, పోచంపల్లి మినహా కాంగ్రెస్ అంతటా స్పష్టమైన మెజార్టీ సాధించింది.

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 12అసెంబ్లీ స్థానాల్లో ఒక్క సూర్యపేట మినహా మిగిలిన 11 ఎమ్మెల్యేలను గెలుచుకున్న కాంగ్రెస్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆధిపత్యాన్ని సాధించగా.. ఇప్పుడు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ తన సత్తాను మరోసారి చాటుకుంది.  ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహా ఎంపీలు, ఎమ్మె ల్యేలు అంతా కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికలలో విజయాలు అందించడం ద్వారా తమ బలాన్ని నిరూపించుకోగలిగారు.

నల్లగొండ జిల్లాలో

౧.నందికొండ మున్సిపాలిటీ (12) - కాంగ్రెస్ 11, బీఆర్‌ఎస్ 1

2.హాలియా మున్సిపాలిటీ (12): కాంగ్రెస్ 11, బీఆర్‌ఎస్ 1

3. చండూరు మున్సిపాలిటీ(10): కాంగ్రెస్ 6, బీఆర్‌ఎస్ 3, సీపీఐ 1

4.చిట్యాల మున్సిపాలిటీ (12): కాంగ్రెస్ 9, బీఆర్‌ఎస్ 2,స్వతంత్ర (ట్రాన్స్ జెండర్) 1

5.దేవరకొండ మున్సిపాలిటీ (20): కాంగ్రెస్ 11, బీఆర్‌ఎస్ 6, బీజేపీ 1, స్వతంత్రులు 1

6.మిర్యాలగూడ మున్సిపాలిటీలో (48): కాంగ్రెస్ 31, బీఆర్‌ఎస్ 14, స్వతంత్రులు 2, బీజేపీ 1

సూర్యాపేట జిల్లాలో..

1.సూర్యాపేట మున్సిపాలిటి (48): కాంగ్రెస్ 31, బీఆర్‌ఎస్ 10, బీజేపీ 1, స్వతంత్రులు 6

2.కోదాడ మున్సిపాలిటీ (35): కాంగ్రెస్ 27, బీఆర్‌ఎస్ 3, స్వతంత్రులు 5

3.నేరేడుచర్ల మున్సిపాలిటీ( 15): కాంగ్రెస్ 9, బీఆర్‌ఎస్ 5, జనసేన -1

4.హుజూర్ నగర్ మున్సిపాలిటీ (28): కాంగ్రెస్ 19, బీఆర్‌ఎస్ 4, స్వతంత్రులు 3, సీపీఎం 1, సీపీఐ 1

5.తిరుమలగిరి మున్సిపాలిటీ(15): బీఆర్‌ఎస్ 10, కాంగ్రెస్ 5

యాదాద్రి భువనగిరి జిల్లాలో..

1. భువనగిరి మున్సిపాలిటీ (35): కాంగ్రెస్ 22, బీఆర్‌ఎస్ 4, బీజేపీ 4, స్వతంత్రులు 5

2.ఆలేరు మున్సిపాలిటీ(12): కాంగ్రెస్ 7, బీఆర్‌ఎస్ 3, బీజేపీ 2

3.యాదగిరిగుట్ట మున్సిపాలిటీ (12): కాంగ్రెస్ 8, బీజేపీ 2, బీఆర్‌ఎస్ 1, సీపీఐ 1

4.మోత్కూరు(12): -కాంగ్రెస్ 8, బీఆర్‌ఎస్ 3, స్వతంత్రులు 1

5.చౌటుప్పల్ (20): కాంగ్రెస్ 13, బీఆర్‌ఎస్ 3, బీజేపీ 3, సీపీఎం 1

6.పోచంపల్లి(13) : కాంగ్రెస్ 6, బీఆర్‌ఎస్ 5, బీజేపీ 1, స్వతంత్రులు 1.