కార్మికులకు అండగా కాంగ్రెస్ పార్టీ
సర్వోత్తమ్ రెడ్డి, గుడిపాటి నరసయ్య
సూర్యాపేట, మే 1 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ కార్మికులకు ఎల్లప్పుడు అండగా ఉంటుందని, కార్మికుల సమస్యలపై నిరంతరము పార్టీ అనుబంద సంఘం ఐఎన్ టియుసి ఆద్వర్యంలో పోరాటం చేస్తామని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు గుడిపాటి నరసయ్య అన్నారు. మే డే సందర్భంగా శుక్రవారం పట్టణంలోని జమ్మిగడ్డలో గల విద్యుత్ కార్యాలయం వద్ద ఐఎన్ టియుసి ఆధ్వర్యంలో జరిగిన మేడే ఉత్సవాల్లో పాల్గొని జెండాను ఆవిష్కరించారు.
అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో నిర్మాణం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అనుబంద సంఘాలకు ప్రత్యేకంగా కార్యాలయాలు ఏర్పాటు చేయడంలో భాగంగా ఐఎన్ టియుసికి కూడా కార్యాలయము ఏర్పాటు చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫి వుల్లా, ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలి, జిల్లా యూత్ కాంగ్రెస్ అద్యక్షులు ఎలిమినేటి అభినయ్, నాయకులు చింతమల్ల రమేష్,అబ్దుల్ రహీం, వీరన్న నాయక్, బైరు వెంకన్న, పోలగాని బాలు గౌడ్, బండారు వెంకన్న, అన్నమయ్య రాము,నరేందర్ నాయుడు, కోడి శివ, పంతంగి దశరథ, చొక్కయ్య, కౌన్సిలర్ లు కొండపల్లి దిలీప్ రెడ్డి, నాగుల వాసు, రాపర్తి శ్రీను, టిఎస్ ఇ సంఘం నాయకులు దశరధ రెడ్డి, బూర్గుల వెంకన్న, వీర మల్లు, రాము తదితరులు పాల్గొన్నారు.
వాటర్ సప్లై కార్యాలయంలో మేడే వేడుకలు
మున్సిపల్ వాటర్ సప్లై కార్యాలయం వద్ద జరిగిన వేడుకలలో ఎఐ సిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ఐఎన్ టి యు సి జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వాటర్ సప్లై యూనియన్ గౌరవ అధ్యక్షులు కక్కిరేణి శ్రీనివాస్, అద్యక్షులు సయ్యద్ సమి, కార్యదర్శి గుండా నాగరాజు, కోశాధికారి పటాని శ్రీనివాస్, ఉద్యోగులు పాల్గొన్నారు.






