2 May, 2026 | 2:38 AM

ఇప్పటికీ కనీస వేతనాలకు నోచుకోని కార్మికులు

02-05-2026 01:31 AM

సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు శంకర్

మంచిర్యాల, మే 1(విజయక్రాంతి) : కార్మికులకు ఇప్పటికీ కనీస వేతనాలు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారని, కనీస వేతనాలివ్వలేని ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్ విమర్శించారు. శుక్ర వారం మే దినోత్సవాన్ని పురష్కరించుకొని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఉన్న ఏఐటీయూసీ జెండాను ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు ఆవిష్కరించిన అనంతరం ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్యతో కలిసి శంకర్ మాట్లాడారు.

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వలేని ప్రభుత్వాలు ఈ రోజు అధికారంలో ఉండటం సిగ్గు చేటన్నారు.  గతంలో ఉన్న 44 కార్మిక చట్టాలను కొనసాగించాలని, నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కలిందర్ అలీ ఖాన్, కే వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, దేవి పోచన్న, మధు, రాయమల్లు, రాకేష్, ప్రశాంత్, రాజేశ్వరి, షీలా, పద్మ, నర్సయ్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు.