30 April, 2026 | 5:32 PM

మృతుని కుటుంబానికి అండగా కాంగ్రెస్ పార్టీ

30-04-2026 03:15 PM

మంత్రి అడ్లూరి సూచనతో రూ.10000 ఆర్థిక సాయం!

ధర్మపురి,ఏప్రిల్30(విజయక్రాంతి): వెల్గటూర్ మండలం రాజక్కపల్లి గ్రామంలో ఇటీవల విద్యుత్ ఘాతంతో దుర్మరణం చెందిన కుశనపెల్లి శ్రీనివాస్ కుటుంబానికి మండల కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచనతో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాటిపర్తి శైలందర్ రెడ్డి ఆధ్వర్యంలో  మృతుడు శ్రీనివాస్ కుటుంబాన్ని గురువారం పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

రూ.10000 ఆర్థిక సాయం అందించి కుటుంబానికి మనోధైర్యం కల్పించారు. మృతుడు శ్రీనివాస్ కుటుంబానికి అన్నీ విధాలుగా అండగా ఉంటామనీ తెలిపారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దోరిశెట్టి మల్లేశం, మార్కెట్ కమిటీ చైర్మన్ గోల తిరుపతి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మద్దుల గోపాల్ రెడ్డి,ఉపసర్పంచ్ మర్రి పోచయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేరుగు మురళి గౌడ్,గుండాటి సందీప్ రెడ్డి, బందెల ఉదయ్ గౌడ్, ఎర్రోల్ల సతీష్,దావుల శశి, మన్నె జితేందర్, వార్డు సభ్యులు బొడ్డు రమేష్ తదితరులు పాల్గొన్నారు.