14 July, 2026 | 4:02 PM

Breaking News

ఫీజు రీయంబర్స్ మెంట్ ను విడుదల చేయాలి   •   సుధాకర్ కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •   తెలంగాణలో SIR గడువు పెంచాలని విజ్ఞప్తి చేశాం: మంత్రి పొన్నం   •   మోదీ, అమిత్ షా స్పందిచరెందుకు?.. 23న మౌనదీక్ష చేస్తా: వీహెచ్   •   కార్మికులకు ఆరోగ్య భరోసా   •   సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వినోద్ బుద్ది మారాలని మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య పూజలు   •   దుర్గాభవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు   •   అర్హులైన ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్లో దరఖాస్తు సమర్పించుకోవాలి   •   చేర్యాలలో మంగళ, శుక్రవారం "డ్రై డే” పాటించాలి   •   ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •  

పదవులు శాశ్వతం కాదు – అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి

16-02-2026 08:21 PM

- చండూరు మున్సిపల్ కొత్త పాలకవర్గానికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచన

చండూరు,(విజయక్రాంతి): చండూరు మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, ఆత్మీయ సన్మాన కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తోపాటు, ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డితో  హాజరై నూతన పాలకవర్గ సభ్యులను సన్మానించి మాట్లాడారు.

పదవులు శాశ్వతం కావని, ప్రజల అభివృద్ధినే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని సూచించారు. నమ్మకంతో గెలిపించిన ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే మునుగోడు అభివృద్ధిలో వెనుకబడి ఉందని, మనందరం కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం అన్నారు. చండూరు మున్సిపాలిటీని హైదరాబాద్ తరహాలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు.

ప్రస్తుతం గెలిచిన చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు ఆత్మవిశ్వాసంతో ప్రజలకు సేవ చేయాలని, ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రెసిడెంట్ పున్న కైలాష్ నేత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొరిమి ఓంకారం, మాజీ సర్పంచ్ కోడిగురిబాబు,చండూర్ మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోడి వెంకన్న, కౌన్సిలర్లు బుషిపాక వాసు, కోడి సుష్మ, కలిమికొండ పారిజాత జనార్ధన్, కటకం రమేష్ ఉన్నారు.