ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆర్‌ఎస్‌పీ వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నాయకులు
ఘట్‌కేసర్, ఆగస్టు 17 (విజయక్రాంతి) : సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వజ్రేష్ యాదవ్‌పై మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు ఖండించారు. సోమవారం బొక్కొనిగూడ చౌరస్తాలోని కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, సామల అమర్, రాజేష్, తదితరులు మాట్లాడుతూ.. డీసీసీ అధ్యక్షులు వజ్రెష్ యాదవ్ రాజకీయాల్లో కింది స్థాయి నుంచి ఎదిగి మేడ్చల్ నియోజకవర్గంలో మూడు పర్యాయాలు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా, నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న నాయకుడని ఉన్నారు.
ప్రజల్లో ఉన్న వజ్రేష్ యాదవ్‌ను ఎవరు అంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మ ల్లారెడ్డి ఇప్పటికైనా జోకర్ మాటలు మానుకోవాలని హితవు పలికారు. ఐపీఎస్‌గా పని చేసిన వ్యక్తి ఆధారాలు లేకుండా భూకబ్జాల ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు. ఈ సమావేశంలో అంజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్, రాధాకృష్ణ, సుధాకర్ రెడ్డి, మల్లే ష్, ఖయ్యూం తదితరులు పాల్గొన్నారు.






